ఫ్లాప్ హీరోల పాలిట అదృష్ట దేవతలా మారిన శృతి హాసన్.. ఇంతమంది హీరోలకు హిట్టిచ్చిందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం క్రేజ్ ను పెంచుకుంటున్న హీరోయిన్లలో శృతి హాసన్( Shruti Haasan ) ఒకరు.గ్లామర్ రోల్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న ఈ బ్యూటీ ఫ్లాప్ హీరోల పాలిట అదృష్ట దేవతలా మారారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 Shruti Hassan Is The Lucky Heroine For Flop Heroes Details Here Goes Viral-TeluguStop.com

ఎంతోమంది హీరోలకు ఈ బ్యూటీ హిట్ ఇవ్వగా ఫ్లాపుల్లో ఉన్న హీరోలు శృతి హాసన్ ను తమకు లక్కీ హీరోయిన్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ముందు నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ సాధించలేదు.అయితే పవన్, శృతి కాంబో మూవీ గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.రవితేజ వరుస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో బలుపు సినిమా( Balupu )లో రవితేజ, శృతి కలిసి నటించగా ఈ సినిమా మెమరబుల్ హిట్ గా నిలిచింది.

శ్రీమంతుడు సినిమాకు ముందు మహేశ్ నటించిన రెండు సినిమాలు అంచనాలను అందుకోలేదు.

మహేశ్, శృతి శ్రీమంతుడు సినిమాలో కలిసి నటించగా ఈ సినిమా సక్సెస్ సాధించింది.పవన్ ఫ్లాపుల్లో ఉన్న సమయంలో వకీల్ సాబ్ సినిమాలో పవన్, శృతి కలిసి నటించగా ఈ సినిమా సక్సెస్ సాధించింది.రవితేజ వరుస ఫ్లాపుల్లో ఉన్నసమయంలో మాస్ మహారాజ్, శృతి కలిసి క్రాక్ సినిమాలో నటించగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది.

ప్రభాస్ వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభాస్, శృతి కలిసి నటించిన సలార్( Salaar ) మూవీ ప్రేక్షకులను మెప్పించింది.ఆచార్య, గాడ్ ఫాదర్ ఆశించిన ఫలితాలను అందుకోలేదు.

అయితే చిరంజీవి, శృతి కలిసి నటించిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.శృతి హాసన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube