2023 ఏడాదిలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీళ్లే..!

2023 ఏడాదిలో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా( Ravindra Jadeja ) అగ్రస్థానంలో ఉన్నాడు.రవీంద్ర జడేజా భారత్ తరపున 35 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి, 66 వికెట్లు తీశాడు.

 2023 Top 5 Indian Bowlers With Most Wickets Jadeja Shami Siraj Kuldeep Ashwin De-TeluguStop.com

రవీంద్ర జడేజా 23 సగటు, 42 స్ట్రైక్ రేట్ తో బౌలింగ్ చేశాడు.ఈ జాబితాలో భారత జట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్( Kuldeep Yadav ) రెండవ స్థానంలో నిలిచాడు.

కుల్దీప్ యాదవ్ భారత్ తరపున 39 అంతర్జాతీయ మ్యాచులు ఆడి, మొత్తం 63 వికెట్లు తీశాడు.కుల్దీప్ యాదవ్ 18.85 సగటు, 23.6 స్ట్రైక్ రేట్ తో బౌలింగ్ చేశాడు.

ఈ జాబితాలో భారత జట్టు పేసర్ మహమ్మద్ సిరాజ్( Mohammed Siraj ) మూడవ స్థానంలో ఉన్నాడు.మహమ్మద్ సిరాజ్ 33 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి, 58 వికెట్లు తీశాడు.మహమ్మద్ సిరాజ్ 23 సగటు, 31 స్ట్రైక్ రేట్ తో బౌలింగ్ చేశాడు.భారత జట్టు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ( Mohammed Shami ) ఈ జాబితాలో నాలుగవ స్థానంలో నిలిచాడు.

మహమ్మద్ షమీ 23 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి 57 వికెట్లు తీశాడు.మహమ్మద్ షమీ 20 సగటు, 26 స్ట్రైక్ రేట్ తో బౌలింగ్ చేశాడు.

భారత జట్టు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్( Ravichandran Ashwin ) ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచాడు.రవిచంద్రన్ అశ్విన్ కేవలం 9 అంతర్జాతీయ మ్యాచులు ఆడి, ఏకంగా 45 వికెట్లు తీశాడు.రవిచంద్రన్ అశ్విన్ 17.31 సగటు, 37.8 స్ట్రైక్ రేట్ తో బౌలింగ్ చేశాడు.ఈ ఏడాది 2023లో భారత్ కు ఒకే ఒక మ్యాచ్ మిగిలి ఉంది.

అదే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్.ఈ మ్యాచ్ లో మహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా రాణిస్తే.2023 టాప్-5 బౌలర్ల స్థానాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube