ముఖ చర్మాన్ని తెల్లగా మార్చుకునేందుకు మనలో చాలా మంది తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.ఇందులో భాగంగానే ఖరీదైన స్కిన్ వైట్నింగ్ క్రీమ్( Skin whitening cream ), సీరం లను కొనుగోలు చేసే వాడుతుంటారు.
కాస్త ఎక్కువ డబ్బు ఉన్న వారైతే స్కిన్ వైట్నింగ్ ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటూ ఉంటారు.కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే సులభంగా మరియు వేగంగా చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.
స్కిన్ వైట్నింగ్ కోసం ఆరాటపడే వారికి బెస్ట్ రెమెడీ ఇది.దీన్ని ట్రై చేశాక రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు చందనం పొడిని( Sandalwood powder ) వేసుకోవాలి.అలాగే పావు టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్,( Wild Turmeric Powder ) చిటికెడు కుంకుమపువ్వు, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ మరియు మూడు టేబుల్ స్పూన్లు తేనె ( honey )వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం చర్మాన్ని సున్నితంగా రబ్ చేస్తూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ వండర్ ఫుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే మీ చర్మం కొద్ది రోజుల్లోనే తెల్లగా కాంతివంతంగా మారుతుంది.సహజ మెరుపు మీ సొంతం అవుతుంది.
మొటిమలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మచ్చలు ఏమైనా ఉన్నా సరే తగ్గు ముఖం పడతాయి.
అందమైన తెల్లటి మెరిసే ముఖ చర్మాన్ని కోరుకునే వారు తప్పకుండా ఈ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని ట్రై చేయండి.మంచి రిజల్ట్ ను అందుకుంటారు.