అతిలోక సుందరి శ్రీదేవి ( Sridevi ) భర్తగా, బాలీవుడ్ బడా నిర్మాతగా బోణి కపూర్ కి( Boney Kapoor ) ఎంత మంచి ఫేమ్ ఉందో మన అందరికీ తెలిసిందే.ఇతను శ్రీదేవి ని పెళ్లి చేసుకున్నప్పుడు ఇండియాలో ఉన్న పెళ్లికాని సూపర్ స్టార్స్ అందరూ అసూయపడ్డారు.
బోనీ కపూర్ పర్సనాలిటీకి అంత అందమైన హీరోయిన్ ఎలా పడిపోయిందిరా బాబు అని అప్పట్లో అందరూ అనుకునేవారు.పెళ్ళైన తర్వాత ఎంతో అన్యోన్య దాంపత్య జీవితం గడిపిన వీళ్లిద్దరికీ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) మరియు ఖుషి కపూర్( Khusi Kapoor ) అని ఇద్దరు అందమైన కుమార్తెలు ఉన్నారు.
జాన్వీ కపూర్ కి పాన్ ఇండియా లెవెల్ లో యూత్ ఆడియన్స్ లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈమెకి మిగిలిన హీరోయిన్స్ లాగ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ ఏమి లేవు, అయినప్పటికీ కూడా తన అందం తో కోట్లాది మంది యువకుల హృదయాలను గెలుచుకుంది.

ప్రస్తుతం ఈమె యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘దేవర’( Devara ) అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది.ఇదంతా పక్కన పెడితే బాలీవుడ్ లో ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఒక వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.అదేమిటి అంటే బోణీ కపూర్ తన పేరు మీద మరియు తన కూతుర్ల పేరు మీద ఉన్న కొన్ని ఆస్తులను( Boney Kapoor Assets ) రీసెంట్ గానే అమ్మేసినట్టుగా తెలుస్తుంది.వివరాల్లోకి వెళ్తే ముంబై లోనో అంధేరీ( Andheri ) శివార్లలో బోణి కపూర్ పేరిట ఉన్న నాలుగు అంతస్తుల అపార్ట్మెంట్స్ ని ( Apartment ) అమ్మేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అలాగే అంధేరీ వెస్ట్ లో ఉన్నటువంటి మరో రెండు ఫ్లాటులను ఆరు కోట్ల రూపాయలకు అమ్మేసినట్టు తెలుస్తుంది.అలాగే లోఖండ్ వాలా లో ఉన్న రెండు అపార్ట్మెంట్స్, అదే కాంప్లెక్స్ లో ఉన్న మరో రెండు అపార్ట్మెంట్స్ ని ఆరు కోట్ల రూపాయలకు అమ్మేసినట్టుగా తెలుస్తుంది.

అలాగే బాంద్రా లోని( Bandra ) 65 కోట్ల రూపాయిలు విలువ చేసే డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్స్ ని కూడా అమ్మేసారట.ఇప్పుడు అకస్మాత్తుగా ఇంత గొప్ప ఆస్తులను అమ్మేయాల్సిన అవసరం ఏమి వచ్చింది?, బోణి కపూర్ పెద్ద నిర్మాత, ఆయన దగ్గర డబ్బులకు కొదవ లేదు.అలాగే జాన్వీ కపూర్ కూడా పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్, ఒక్కో సినిమాకి ఈమె 5 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.అలా వాళ్ళ కుటుంబం లో ఎన్నో వ్యాపారాలు నుండి ప్రతీ నెల డబ్బులు వస్తూనే ఉంటాయి.
అయినప్పటికీ ఎందుకు ఆస్తులు అమ్మాల్సి వచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదు.