1957లో కెనడాలో మెడిసిన్ ప్రాక్టీస్ ప్రారంభించిన తొలి ఇండో కెనడియన్ డాక్టర్ గుర్దేవ్ సింగ్ గిల్ (92)( Dr Gurdev Singh Gill ) ఈ వారం ప్రారంభంలో కన్నుమూశారు.ఆరోగ్య సంరక్షణ రంగానికి, ముఖ్యంగా గ్రామీణ పంజాబ్‌లో( Rural Punjab ) ఆయన ఎన్నో సేవలు అందించారు.1995లో డాక్టర్ గిల్ ఇండో కెనడియన్ ఫ్రెండ్‌షిప్ సొసైటీతో కలిసి హోషియార్‌పూర్, రోపర్, నవన్ షహర్, జలంధర్, కపుర్తలా, గురుదాస్‌పూర్, లూథియానా గ్రామాలలో ప్రజా సంరక్షణ ఉద్యమానికి నాయకత్వం వహించారు.అలాగే ఉత్తరాఖండ్‌లోని ఓ క్లినిక్‌తోనూ ఆయనకు సంబంధాలు వున్నాయి.
అలాగే కనీసం 27 క్లినిక్‌ల కార్యకలపాలను సైతం డాక్టర్ గిల్ పర్యవేక్షిస్తున్నారు.
ఆయన సామాజిక సేవను మెచ్చుకుంటూ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం( Dr APJ Abdul Kalam ) 2003లో అభివృద్ధి ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవం కోసం గిల్ స్వగ్రామం ఖరౌడీ (హోషియార్‌పూర్ జిల్లా)కి వచ్చారు.హెల్త్‌కేర్‌తో పాటు కాంక్రీట్ రోడ్లు, పార్కులు, లైబ్రరీలు, సోలార్ సెల్‌లపై నడుస్తున్న వీధిలైట్లు, సెప్టిక్ ట్యాంకులు, తాగునీరు, స్థానిక పాఠశాలలకు కంప్యూటర్లు, సాంకేతికతను అందించడంలో వివిధ ప్రాజెక్ట్‌లకు కూడా డాక్టర్ గిల్ గ్రూప్ సహకరించింది.డాక్టర్ గిల్ డిసెంబర్ 17న చండీగఢ్‌లోని తన స్వగృహంలో విడిచారు.
1931లో జన్మించిన డాక్టర్ గిల్ 1949లో కెనడాకు( Canada ) వలస వెళ్లారు.అక్కడ ఒక మిల్లులో పనిచేసిన ఆయన 12వ గ్రేడ్‌ను పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా( University of British Columbia ) నుంచి పట్టభద్రుడయ్యారు.సమాజానికి అందించిన సేవలకు గాను ఆయనకు 1990లో ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా( Order of British Columbia ) అందుకున్నారు.ఈ ఘనత అందుకున్న తొలి పంజాబీగా డాక్టర్ గిల్ నిలిచారు.
డాక్టర్ గిల్ వలసదారులు ఎదుర్కొంటున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా గళం విప్పి ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు.ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు , ఇండో కెనడియన్ కమ్యూనిటీ సంతాపం తెలిపింది.