Prabhas Rajamouli : టాలీవుడ్ లో ఏ హీరోను ఏ డైరెక్టర్ కరెక్ట్ గా వాడుకున్నారు ?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలకు కొదవలేదు.ఎంత మంచి హీరో అయినా సక్సెస్ వస్తేనే మార్కెట్ ఉంటుంది మార్కెట్ ఉంటేనే రెమ్యూనరేషన్ గట్టిగా దొరుకుతుంది.

 Tollywood Directors Who Uses Properly Heros-TeluguStop.com

అలా రెమ్యూనరేషన్ కి డోకా లేకుండా మార్కెట్ మైంటైన్ చేయడం అనేది అంత సాధారణ విషయం ఏమీ కాదు.ట్రెండుకు తగ్గట్టుగా ఉండాలి, ట్రెండు తో పాటు కలిసి పోవాలి బాడీ మెయింటెన్ చేయాలి, కథలను సరిగ్గా ఎంచుకోగలగాలి, జనాల పల్స్ తెలిసి ఉండాలి.

ఇలా ఇన్ని మేనేజ్ చేస్తే తప్ప హీరో అనేవాడు మార్కెట్లో సర్వైవ్ అవడం చాలా కష్టం మరి ఇన్ని ఉన్నా కూడా కొన్నిసార్లు కొన్ని విషయాల్లో హీరోలు మిస్ ఫైర్ అవుతూ ఉంటారు.ఉదాహరణకి ప్రభాస్(Prabhas ) ని తీసుకోండి అతడు బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆ తర్వాత ఎన్ని అవకాశాలు వచ్చినా మళ్ళీ ఆ రేంజ్ హిట్ దొరకలేదు.

Telugu Allu Arjun, Directors, Heros, Ntr, Mahesh Babu, Prabhas, Prashanth Neel,

మరి టాలీవుడ్ లో ఏ హీరోను ఏ డైరెక్టర్ సరిగా ఎలివేట్ చేశాడు ఏ హీరో ఏ డైరెక్షన్లో ఎక్కువగా హిట్టు కొట్టాడు అనే విషయాలను ఈ ఆర్థికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఇప్పుడు సలాడ్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ప్రభాస్ విషయానికే వస్తే ప్రభాస్ ని ఖచ్చితంగా బాగా వాడుకున్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది రాజమౌళి( Rajamouli ) అందరి కన్నా ముందు రాజమౌళి ప్రభాస్ లోని టాలెంట్ గుర్తించి ఛత్రపతి వంటి సినిమా ఇచ్చాడు.తర్వాత బాహుబలి సినిమాతో ఆ రేంజ్ మరింత పెరిగింది.ఇక చాలా ఏళ్లుగా ఒక హిట్టు కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ కి ప్రశాంత్ నీల్ న్యాయం చేశాడు.

అతడికి ఈ సలార్ వంటి గట్టి సినిమా ఇచ్చి ప్రభాస్ పని అయిపోలేదని నిరూపించాడు.ఇక ఇదే తరహా జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )విషయానికొస్తే అతన్ని కరెక్టుగా వాడుకున్న డైరెక్టర్లు కూడా ఇద్దరే ఇద్దరు.

అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది వివి వినాయక్ గురించి.ఆది వంటి బంపర్ హిట్ ఇచ్చి తారక్ ని సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి హీరో అనే స్థాయి కల్పించాడు.

ఆ తర్వాత సాంబ, అదుర్స్ కూడా ఉన్నాయి.ఇక తారక్ విషయంలో రాజమౌళి గురించి చెప్పాల్సిన అవసరం లేదు.సింహాద్రి, యమదొంగ నుంచి ఆర్ఆర్ఆర్( RRR ) సినిమా వరకు వీరి కాంబినేషన్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది.

Telugu Allu Arjun, Directors, Heros, Ntr, Mahesh Babu, Prabhas, Prashanth Neel,

ఇదే రకంగా మహేష్ బాబుని సరిగ్గా వాడుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్.వీరి కాంబినేషన్లో వచ్చిన పోకిరి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.మహేష్ బాబు కెరియర్ ను పోకిరి కి ముందు పోకిరి కి తర్వాత అనే వాళ్ళు కూడా కొంత మంది ఉంటారు.

ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే సుకుమార్ అల్లు అర్జున్ ని వాడినట్టుగా మరే దర్శకుడు వాడలేదు ఆర్య సినిమాతో మొదలెట్టి ఆ తర్వాత పుష్ప సినిమాలతో వీరి ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube