షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో తెరకెక్కిన డంకీ సినిమా( Dunki movie ) ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో ఫెయిలైంది.ఫస్టాఫ్ అద్భుతంగా ఉన్నా సెకండాఫ్ ప్రేక్షకులను నిరాశపరిచింది.
డంకీ సినిమాకు బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో లేవు.ఫుల్ రన్ లో ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది.
డంకీ సినిమా టాక్ తో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

క్రిస్మస్ విన్నర్ సలార్ అంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సలార్ సినిమా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వేరే లెవెల్ లో ఉండనున్నాయని మేకర్స్ చెబుతున్నారు.సలార్1 కు చాలా ఏరియాలలో టికెట్లు దొరకడం లేదు.ఎన్ని థియేటర్లు కేటాయించినా ఈ సినిమాకు సరిపోవడం లేదు.సలార్ డే1 కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండే ఛాన్స్ అయితే ఉంది.

క్రిస్మస్ పండుగ వరకు సలార్ సినిమా దూకుడుకు బ్రేక్ వేయడం సాధ్యం కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్( Salaar ) బిజినెస్ లెక్కలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి.నాన్ థియేట్రికల్ హక్కులతో కలిపి ఈ సినిమాకు 500 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది.సలార్1 ప్రభాస్ కోరుకున్న అత్యంత భారీ సక్సెస్ ను అందిస్తుందో లేదో చూడాల్సి ఉంది.సలార్2 మూవీ వచ్చే ఏడాది మొదలవుతుందని వార్తలు వినిపిస్తుండగా క్లారిటీ రావాల్సి ఉంది.సలార్ రిజల్ట్ మరికొన్ని గంటల్లో తేలిపోనుండగా అభిమానులు కోరుకుంటున్న భారీ సక్సెస్ ను ఈ సినిమా అందిస్తుందో లేదో చూడాలి. ప్రభాస్, ప్రశాంత్ నీల్ సలార్ తో సంచలనాలు సృష్టించాలని బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే క్రియేట్ అయిన రికార్డ్ లను బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.2023 బిగ్గెస్ట్ హిట్ గా సలార్ నిలిచే ఛాన్స్ అయితే ఉంది.







