సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు అడుగు పెడుతుంటారు కానీ వారిలో చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అవుతారు.అలాంటి హీరోయిన్లలో ఒకరు భానుప్రియ.
భానుప్రియ( Bhanupriya ) నటనలో అద్భుతమైన నైపుణ్యాన్ని సాధించింది.అంతేకాదు ఈ ముద్దుగుమ్మ కూచిపూడి డ్యాన్స్ కూడా నేర్చుకుంది.
అలాగే వాయిస్ ఆర్టిస్ట్ గా మారి సినీ ఇండస్ట్రీకి విశేషమైన సేవలను అందించింది.మొదట హీరోయిన్‌గా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఈ తార ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగలదు.
అందుకే ఆమెను తెలుగు ప్రేక్షకులు బాగా గుర్తుపెట్టుకున్నారు.ఇప్పటికీ ఆమె అడపా దడపా నటిస్తున్న సినిమాలను చూస్తూ ఆదరిస్తుంటారు కూడా.
భానుప్రియ చివరిగా తెలుగులో చేసిన సినిమా నాట్యం.ఇందులో ఆమె హీరోయిన్ తల్లి పాత్ర చేసింది.2022లో తమిళంలో రెండు సినిమాలు చేసింది.

భానుప్రియ కెరీర్ లైఫ్ ఎంతో బాగా సాగినప్పటికీ పర్సనల్ లైఫ్ మాత్రం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది.భానుప్రియ 1998లో ఆదర్శ్ కౌశల్ అనే వ్యక్తిని పెళ్లాడింది.అయితే వైవాహిక బంధంలో ఎన్నో మనస్పర్ధలు వచ్చాయి.
అందువల్ల భానుప్రియ 2005లో అతడి నుంచి డివోర్స్ తీసుకుంది.అయితే అప్పటికే వీరిద్దరికి అభినయ అనే ఒక పాప పుట్టింది.2018 లో ఆదర్శ్ కౌశల్( Adarsh Kaushal ) గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ కన్నుమూశాడు.

అయితే భానుప్రియ సినిమాల్లో నటించడమే కాక పబ్లిక్ ఈవెంట్స్ లో కూడా కనిపిస్తుంటుంది.కొన్ని నెలల క్రితం ఆమె ఒక ఈవెంట్ కి వచ్చి ఆశ్చర్యపరిచింది.దానికి సంబంధించిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వీడియో ఓపెన్ చేస్తే భానుప్రియ నడవడానికి కూడా చాలా కష్టపడుతున్నట్లు మనం గమనించవచ్చు.ఒకప్పుడు ఎంతో చలాకీగా ఉంటూ, మెరుపుతీగ లాగా డాన్స్ చేసిన భానుప్రియ ప్రస్తుతం నడవలేని పరిస్థితిలో ఉండటం చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
భానుప్రియకి ఏమైందని మరికొందరు ఆరా తీస్తున్నారు.కొన్ని సోర్సెస్ ప్రకారం భానుప్రియ ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది, అంతే కాకుండా కంటి చూపుకి సంబంధించిన సమస్యతో ఆమె బాధపడుతున్నట్లు సమాచారం.
అయితే ఆమె ఆరోగ్యానికి సంబంధించి వస్తున్నాయి రూమర్స్ లో నిజం ఎంత ఉందో తెలియ రాలేదు.మళ్లీ ఈ తార తెలుగులో నటిస్తుందో లేదో కూడా తెలియదు.







