హీరో నాని( Nani ) ఒక ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠి కి సంబంధించిన కొన్ని సంచలన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.ప్రస్తుతం మెగా ఇంటి కోడలుగా లావణ్య త్రిపాఠి ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే.
మరి నానికి లావణ్య త్రిపాఠి కి మధ్య అలాంటి విషయాలు ఏమున్నాయి ? ఆ సంఘటనలు ఏంటి అనే విషయం ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.నాని ఈగ సినిమాలో ( Eega )నటిస్తున్న సమయంలోనే అందాల రాక్షసి సినిమా సైతం తెరకెక్కుతుందట ఈ రెండు సినిమాలకు నిర్మాతగా సాయి కొరపాటి గారే ఉన్నారు.
దాంతో అందాల రాక్షసి సినిమాకు సంబంధించి వర్క్ స్టార్ట్ అవ్వగానే ఆ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ఈగ షూటింగ్ లొకేషన్ లో చెప్పేవారట సాయి.

అందాల రాక్షసి సినిమా( Andala Rakshasi ) కోసం ఒక అద్భుతమైన హీరోయిన్ ని తీసుకున్నామని, ఆమె ఎంత అద్భుతంగా నటిస్తుంది అంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదని, ఆమెను ఎవ్వరు అడిగినా కూడా బయట ప్రొడక్షన్స్ కి మన సినిమా అయిపోయే వరకు ఇచ్చేది లేదని, ఆమె గురించి ఎలాంటి విషయాలు కూడా సినిమా విడుదలకు ముందు లీక్ కాకుండా జాగ్రత్తగా ఉండాలని, ఈగ షూటింగ్ టైంలో నాని మరియు రాజమౌళికి తెగ చెప్పేవారట సాయి కొర్రపాటి.దాంతో నాని చాలా ఎక్సైట్ అయిపోతూ ఆ హీరోయిన్ ఫోటో చూపించమంటే అందుకు సాయి ఒప్పుకోలేదట.సినిమా పూర్తయిన తర్వాత ఒకరోజు రష్ చూస్తున్న టైం లో లావణ్య త్రిపాఠి ని చూసిన తర్వాత నాని మంత్రముగ్ధుడైపోయాడట.

ఆమెను చూడగానే ఒక న్యాచురల్, రియల్ లైఫ్ అమ్మాయిలా అనిపించిందని, హీరోయిన్ అంటే ఒక మోడల్ లేదా డాల్ లాగా ఉండాలి అనే దానికి పూర్తిగా భిన్నంగా ఉందని, ఎప్పటికైనా ఆమె ఒక గొప్ప హీరోయిన్ అయిపోతుందని అనుకున్నాను అని నాని చెప్పడం విశేషం.అలాగే మారుతీతో భలే భలే మగాడివోయ్ సినిమా( Bhale Bhale Magadivoy ) ఓకే చేసిన తర్వాత మన సినిమా కోసం లావణ్య త్రిపాఠి నీ హీరోయిన్ గా ఎంపిక చేస్తానని చెప్పగానే నాని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడట.పైగా ఆ సినిమా టైంలో చిన్న చిన్న జోకులకు సైతం లావణ్య పడి పడి నవ్వడం చూసి ఆ సినిమా హిట్ అవుతుందని ముందే ఊహించారట నాని మరియు మారుతి.అందుకు ఆమెకు పక్కా థాంక్స్ చెప్పాలని కూడా చెప్పాడు నాని.







