ప్రభాస్ (Prabhas) నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్( Salaar ) డిసెంబర్ 22 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో చిత్ర బృందం మొత్తం ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీ అయ్యారు.
ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈయన కూడా ఈ సినిమా ప్రమోషన్ల నిమిత్తం హైదరాబాద్ చేరుకున్నారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ఈ సినిమాలో నటించడం గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా పృధ్విరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.ఈ సినిమాలు తాను వరదరాజ మన్నార్( Varadaraja Mannar ) అనే పాత్రలో నటించానని తెలిపారు.ఈ పాత్ర కోసం తాను చాలా కష్టపడ్డాను అని తెలియజేశారు.
ఈ పాత్ర కోసం నేను పడిన కష్టం మొత్తం ఫలించిందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ప్రశాంత్ ఇన్ పుట్ చాలా బలంగా ఉందని ఆయన క్షణంలో షార్ట్ మొత్తం మార్చగల దర్శకుడు ఇప్పటివరకు నా సినీ కెరియర్ లోనే నేను ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి గొప్ప స్క్రిప్ట్ చూడలేదని ఇలాంటి ఒక గొప్ప సినిమాలో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఇక ఈ సినిమాలో భాగం అవ్వడంతో ప్రభాస్ తో నటించాలి అనే కల కూడా నెరవేరింది అంటూ ఈ సందర్భంగా పృధ్విరాజ్ సుకుమారన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ప్రభాస్ గొప్పతనం గురించి కూడా మాట్లాడుతూ ప్రభాస్ గురించి ఎవరైనా చెబితే అర్థం కాదు కానీ ఆయనని ఒకసారి కలిస్తే మాత్రం ఆయన ఏంటో అర్థం అవుతుందని తెలిపారు.నేను ప్రతిరోజు మాట్లాడే స్నేహితులలో ప్రభాస్ కూడా ఒకరు అంటూ ఈయన వెల్లడించారు.
ప్రభాస్ ఇతరుల సంతోషంలోనే తన ఆనందం వెతుక్కునే వ్యక్తి అని ఆయన షూటింగ్ లొకేషన్లో ఉంటే ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ వారంతా సౌకర్యంగా ఉన్నారా లేదా అనే విషయాలను గమనిస్తూనే ఉంటారని లొకేషన్ లో ఉన్న అందరికీ మంచి ఫుడ్ తెప్పిస్తారు అంటూ చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి.