సాధారణంగా కండోమ్స్‌ను( Condoms ) సుఖ వ్యాధులు రాకుండా ప్రజలు వాడతారు.అయితే తాజాగా అలాంటి కండోమ్స్‌తో డ్రెస్( Condom Dress ) కుట్టాలనే వింత ఆలోచన ఒక డిజైనర్ కి వచ్చింది.
ఇదేం విడ్డూరమని మనం అనుకున్నా దీని వెనక ఒక మంచి కారణం ఉంది.కండోమ్స్‌తో గౌన్ తయారు చేసిన ఫ్యాషన్ డిజైనర్ పేరు గున్నార్ డెథెరేజ్.
( Gunnar Deatherage ) ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ కోసం లాస్ ఏంజిల్స్ కౌంటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌తో తాజాగా చేతులు కలిపాడు.ఈ ఫ్యాషన్ డిజైనర్ లైంగిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు కండోమ్‌లతో దుస్తులను తయారు చేశాడు.
“నేను కండోమ్‌లతో డ్రెస్‌ని తయారు చేశా.ఇట్స్ స్టన్నింగ్” అనే క్యాప్షన్ తో ఒక యూట్యూబ్ వీడియోను కూడా పోస్ట్ చేశాడు.
వీడియోలో ఎక్స్‌పైర్డ్ కండోమ్‌లను బ్యూటిఫుల్ గౌనుగా ఎలా మార్చాడో చూపించాడు.కండోమ్‌ల నుంచి పువ్వులను తయారు చేయడానికి పిన్స్, జిప్ టైలు, స్ప్రే పెయింట్లను ఉపయోగించాడు.
ఆపై అతను వాటిని నల్లటి దుస్తులపై కుట్టాడు.ఆ డ్రెస్ చూసేందుకు అద్భుతంగా కనిపించింది.

వీడియోకు 5 లక్షల కంటే ఎక్కువ లైక్‌లు, అనేక కామెంట్లు వచ్చాయి.ఆ దుస్తులను, డిజైనర్ క్రియేటివిటీని( Designer Creativity ) నెటిజన్లు మెచ్చుకున్నారు.“కండోమ్స్‌ను పెయింట్ చేశాక అవి నిజమైన పువ్వుల వలె కనిపించాయి.” అని ఒకరు కామెంట్ చేశారు.“మీరు చాలా ప్రతిభావంతులు, నైపుణ్యం కలవారు.” అని మరొకరు డిజైనర్‌ను ప్రశంసించారు.

ప్రజలు లైంగిక విద్య ప్రాముఖ్యత గురించి కూడా మాట్లాడారు.“కండోమ్‌లకు ఎక్స్‌పైర్డ్ డేట్ ఉంటుందని చాలా మందికి తెలియదు.ప్రజలకు మరింత లైంగిక విద్య అవసరం.అందుకోసం మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు.ఈ నాలెడ్జీ చాలా మందికి హెల్ప్ అవుతుంది.” అని అన్నారు.హెచ్‌ఐవీ/ఎయిడ్స్ అవగాహనపై ప్రాజెక్ట్ ప్రభావం చూపిందని ప్రజలు కూడా ప్రశంసించారు.







