ఇండియన్ ఫ్యాబ్రిక్‌ను బ్యాన్ చేసిన యూకే.. కారణం తెలిస్తే...

భారతదేశంలో అనేక రకాల కళలు, సంస్కృతులు ఆర్కిటెక్చర్ నైపుణ్యాలు ఉన్నాయి.ఇవే ప్రపంచంలోని అనేక ప్రజల కలలను ప్రభావితం.

 British Banned Indian Fabric Chintz Due To Popularity Details, Cheent, Chintz, I-TeluguStop.com

ఇండియా( India ) గొప్ప, విభిన్న వారసత్వాన్ని కలిగి ఉంది.గ్లోబల్ ఫ్యాషన్‌లో దేశీయ ‘చీంత్’ క్రాఫ్ట్( Cheent Craft ) చాలా సహకారం అందించింది.

ఇది భారతదేశంలో ఉద్భవించి ఐరోపాలో పాపులర్ అయిన ఓల్డ్ టెక్స్ట్‌టైల్ క్రాఫ్ట్. ‘చీంత్’ అనేది హిందీ పదం, దీని అర్థం మచ్చలు లేదా మచ్చలు ఉన్న వస్త్రం.

ఇది హ్యాండ్ పెయింటింగ్ టెక్నిక్‌ను సూచిస్తుంది.వాషింగ్‌ తర్వాత కూడా ఈ మచ్చలు అనేవి వాడిపోవు అంతేకాదు అవి ఎప్పటికీ ఫ్రెష్ గానే ఉంటాయి.కొత్తగా తళతళ మెరుస్తూ ఉంటాయి.ఫ్లవర్స్, జామెట్రీ, యానిమల్స్ వంటి వివిధ రకాల మచ్చలను బట్టల పై చేతితో వేస్తారు.‘చీంత్’ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉత్పత్తి చేశారు, ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్‌లలో ఈ క్రాఫ్ట్ ఇప్పటికీ ఉనికిలో ఉంది.

Telugu British, Chintz, Chintz Fabric, England, Hand, Indian Fabric, Indiantexti

15వ, 16వ శతాబ్దాలలో భారతదేశాన్ని సందర్శించిన ఐరోపా వ్యాపారుల( European Traders ) దృష్టిని ‘చీంత్’ ఆకర్షించింది.వారు ఐరోపాకు పెద్ద మొత్తంలో ‘చీంత్’ని దిగుమతి చేసుకున్నారు, కొంతకాలంలోనే ఈ టెక్నిక్ దుస్తులు, సీటు మెత్తలు, కర్టెన్ల కోసం ఒక ఫ్యాషన్ ఫాబ్రిక్‌గా( Fashion Fabric ) ఉపయోగించడం ప్రారంభించారు.‘చీంత్’ అందం, సాఫ్ట్, డ్యూరబులిటీ కారణంగా చాలామంది దీనిని బాగా ఇష్టపడ్డారు ఇది పాపులర్ కూడా అయింది.

Telugu British, Chintz, Chintz Fabric, England, Hand, Indian Fabric, Indiantexti

అయితే, ‘చింట్జ్’( Chintz ) అని ఐరోపా దేశాలలో దీన్ని పిలిచేవారు.అయితే దీనికి వచ్చిన పాపులారిటీ ఐరోపాలోని స్థానిక వస్త్ర పరిశ్రమలకు కూడా ముప్పు తెచ్చిపెట్టింది, ఇది భారతీయ వస్త్రాల నాణ్యత, వైవిధ్యంతో పోటీపడలేకపోయింది.ఫలితంగా, 17వ, 18వ శతాబ్దాలలో ఫ్రాన్స్( France ) మరియు ఇంగ్లాండ్‌లు( England ) తమ సొంత మార్కెట్‌లు, మిల్లులను రక్షించుకోవాలనే ఆశతో ‘చింట్జ్’ దిగుమతులు, వినియోగంపై నిషేధాలు విధించాయి.నిషేధాలు ఉన్నప్పటికీ, ధనవంతులు ‘చింట్జ్’ ఫ్యాబ్రిక్‌ను అక్రమ రవాణా చేయడం, ధరించడం కొనసాగించారు.

‘చింట్జ్’ క్రాఫ్ట్‌ను పోలిన దాన్ని తయారు చేయడానికి యూరోపియన్ ప్రయత్నాలు చేసింది.కాటన్ స్పిన్నింగ్, నేయడం, ముద్రణ వంటి వివిధ పద్ధతులతో ప్రయోగాలు చేసింది, ఇది చివరికి పారిశ్రామిక విప్లవం అభివృద్ధికి దారితీసింది.

చివరికి ఎలాగోలా స్థానిక ప్రజలను ఆకట్టుకోగలిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube