పులిపై కూర్చున్న బుడ్డోళ్లు.. వీడియో చూస్తే షాకే

1960 నాటి ప్రివెంషన్ ఆఫ్ క్రూయాల్టీ ఆన్ యానిమల్స్( Prevention of Cruelty on Animals ) యాక్ట్ అక్టోబర్ 2017 నుంచి భారతదేశం సర్కస్‌లలో వన్యప్రాణులను ఉపయోగించడాన్ని నిషేధించింది.పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, కోతుల వంటి జంతువులను హింసించకుండా సర్కస్ కంపెనీలను( Circus companies ) నిషేధించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

 Buddolli Sitting On A Tiger Shocking To See The Video, India, China, Circus, Wil-TeluguStop.com

వన్యప్రాణులు సర్కస్ షోల కోసం శిక్షణ పొందినప్పుడు అవి చాలా నొప్పి, ఒత్తిడికి గురవుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.అందుకే వీటిపై బ్యాన్ విధించింది.

అయితే ఇండియాకు విరుద్ధంగా, చైనా ఇప్పటికీ యానిమల్ సర్కస్‌లపై బ్యాన్ విధించలేదు.దీనివల్ల సర్కస్ నిర్వాహకులు ఇష్ట రాజ్యాంగా జంతువులను హింసిస్తున్నారు.తాజాగా ఒక సర్కస్ కంపెనీ( Circus Company పిల్లలను పులి వీపుపై ఎక్కించి, దానితో ఫోటోలు తీసుకోవడానికి అనుమతించింది.ఈ ప్రమాదకర చర్య డిసెంబర్ 6న వెలుగులోకి వచ్చింది, దీని వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది.

గ్వాంగ్జి ప్రావిన్స్‌లోని టియాండాంగ్ కౌంటీలోని సర్కస్‌లో కొంతమంది పిల్లలను పులిపై ఉంచినట్లు వీడియో చూపించింది.సర్కస్ ఒక్కో ఫోటోకు 20 యువాన్లు (దాదాపు రూ.234) వసూలు చేసింది.

మెటల్ ప్లాట్‌ఫామ్‌పై ఒక బోనులో పులిని ఎలా నిర్బంధించారో వైరల్ వీడియోలో మీరు చూడవచ్చు.దాని వెనుక కాళ్లు తాడుతో ఫ్రేమ్‌కు కట్టబడ్డాయి, కానీ దాని ముందు కాళ్లు స్వేచ్ఛగా ఉన్నాయి.దీంతో పులి ఏ క్షణంలోనైనా దాడి చేసే ప్రమాదం ఉంది దానివల్ల చిన్నారులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది.

వీడియోలో సర్కస్ వర్కర్ పిల్లలను పులిపైకి తీసుకురావడానికి సహాయం చేస్తుంటే, మరొకరు కెమెరాతో ఫొటోలు తీస్తున్నారు.చాలా మంది పిల్లలు ఈ అడ్వెంచర్ కు ఆకర్షితులయ్యారు, వారి వంతు కోసం వరుసలో ఉన్నారు.

చైనా సెంట్రల్ టెలివిజన్ (CCTV) నుంచి టియాండాంగ్ కౌంటీ బ్యూరో ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్, రేడియో, టెలివిజన్, టూరిజం శాఖ వీడియో గురించి తెలుసుకుంది.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, హెంగ్లీ స్క్వేర్‌లో సర్కస్ కంపెనీ చట్టవిరుద్ధంగా ప్రదర్శన ఇస్తోందని వారికి చెప్పింది.బ్యూరో దర్యాప్తు ప్రారంభించి, పిల్లలను పులులపై స్వారీ చేసే విధానాన్ని ఆపాలని సర్కస్‌ను ఆదేశించింది.2017లో హునాన్ ప్రావిన్స్‌లో ఇదే విధమైన కేసు జరిగింది, అక్కడ అంతరించిపోతున్న జాతికి చెందిన సైబీరియన్ పులిని టేబుల్‌కి కట్టి సెల్ఫీల కోసం ఉపయోగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube