లోక్ సభలో నెలకొన్న గందరగోళం పరిస్థితుల నేపథ్యంలో ఎంపీలు తీవ్ర భయాందోళనకు గురైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో భద్రతా వైఫల్యంపై లోక్ సభ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే లోక్ సభలో టియర్ గ్యాస్ కలకలంపై స్పీకర్ కీలక ప్రకటన చేశారు.ఘటనపై పూర్తి దర్యాప్తు జరుగుతుందని చెప్పారు.
భద్రతాపరమైన అంశాలపై అన్ని పార్టీల నేతలతో చర్చిస్తామని పేర్కొన్నారు.కాగా సభా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి.
కాగా ఉదయం సభ జరుగుతున్న సమయంలో ఇద్దరు ఆగంతకులు టియర్ గ్యాస్ ను ఉపయోగించిన సంగతి తెలిసిందే.ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన ఎంపీలు బయటకు పరుగులు తీశారు.
ఈ క్రమంలోనే ఇద్దరు నిందితులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.