చలికాలంలో టమోటాలు తింటున్నారా.. మరి మీకు ఈ విషయాలు తెలుసా?

టమోటా( tomatoes ).రోజూవారీ వంటల్లో విరివిరిగా వాడే కూరగాయల్లో ఒకటి.

 Health Benefits Of Eating Tomatoes During Winter! Tomatoes, Tomatoes Health Bene-TeluguStop.com

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధికంగా వినియోగించే కూర‌గాల్లో కూడా ట‌మోటాలు ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.చూడడానికి ఎర్రగా చాలా ఆకర్షణీయంగా కనిపించే టమోటాల్లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి.

అందుకే ఆరోగ్యపరంగా టమోటాలు అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.ముఖ్యంగా చలికాలంలో టమోటాలను కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Telugu Bad Cholesterol, Tips, Latest, Tomatoes-Telugu Health

వింటర్ సీజన్ లో సహజంగానే ఇమ్యూనిటీ సిస్టం వీక్ అవుతుంటుంది.అయితే టమోటాల్లో విటమిన్ సి రిచ్ గా ఉంటుంది.అందువల్ల వీటిని జ్యూస్ లేదా సలాడ్స్ ద్వారా తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.దాంతో సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.అలాగే చలికాలంలో ప్రధానంగా వేధించే సమస్యల్లో డ్రై స్కిన్ ( Dry skin )ఒకటి.అయితే ఈ సమస్యకు టమోటాలు చెక్ పెడతాయి.

నిత్యం ఒక ప‌చ్చి టమోటాను తీసుకోవడం వల్ల సహజంగానే చర్మం తేమగా మారుతుంది.కాంతివంతంగా మెరుస్తుంది.

Telugu Bad Cholesterol, Tips, Latest, Tomatoes-Telugu Health

చ‌ర్మంపై మొండి మచ్చ‌లు ఏమైనా ఉన్నా మాయం అవుతాయి.అలాగే చలికాలంలో ఎంతో మంది గుండెపోటుకు గురవుతుంటారు.కానీ ఆ రిస్క్ ను టమోటాలు తగ్గిస్తాయి.నిత్యం ఒక పచ్చి టమోటా లేదా జ్యూస్ తయారు చేసుకుని తీసుకుంటే రక్తంలో పెరిగిపోయిన చెడు కొలెస్ట్రాల్( Bad cholesterol ) కరుగుతుంది.

గుండె సంబంధిత జబ్బులు వచ్చే అవకాశాలు సైతం తగ్గుతాయి.అంతేకాదు టమోటాను నిత్యం తీసుకోవడం వల్ల బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుంది.ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది.మలబద్ధకం సమస్య ఉంటే దూరం అవుతుంది.

టమోటాల్లో ఉండే విటమిన్ ఎ కంటి చూపును పెంచుతుంది.ఫైబర్ మరియు ఇతర పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.

మరియు టమోటాను తరచూ తీసుకోవడం వల్ల బోన్ హెల్త్ సైతం ఇంప్రూవ్ అవుతుంది.కాబ‌ట్టి, ప్ర‌స్తుత వింట‌ర్ సీజ‌న్ లో ట‌మోటాల‌ను త‌ప్ప‌క డైట్‌లో చేర్చుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube