రాజస్థాన్ సీఎం అభ్యర్థి ఎవరనే అంశానికి మరి కాసేపటితో తెర పడనుంది.మొత్తం 200 సీట్లు ఉన్న రాజస్థాన్ అసెంబ్లీలో 115 సీట్లు సొంతం చేసుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
ఈ మేరకు సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై జైపూర్ బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యేల కీలక సమావేశం జరుగుతోంది.కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని పరిశీలకుల కమిటీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు.
కాగా సీఎం రేసులో దియా కుమారి, వసుంధర రాజే, గజేంద్ర సింగ్ షెకావత్ తో పాటు బాబా బాలక్ నాథ్ ఉన్నారు.ఎమ్మెల్యేల మద్ధతు ఆధారంగా సీఎంను పార్టీ అధిష్టానం ఎంపిక చేయనుందని తెలుస్తోంది.
ఈ క్రమంలో రాజస్థాన్ సీఎం పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







