పాత ఇళ్లు, వస్తువులలో గోల్డ్ కాయిన్స్, జ్యువలరీ ఇంకా విలువైన డైమండ్స్( Diamonds ) దొరికిన సందర్భాలు ఉన్నాయి.గతంలో దాచిన ఇలాంటి విలువైన సంపద దొరకడం చాలా అరుదు.
ఎంతో అదృష్టం చేసి ఉంటే గానీ ఇలాంటివి దొరకవు.అయితే తాజాగా అలాంటి అదృష్టం టెక్సాస్ కు చెందిన ఎమిల్ నోడెల్‌కు( Emil Knodell ) దక్కింది.2015లో రూ.8,000కు ఒక పాత ఫర్నిచర్ కొనుగోలు చేశాడు.వార్డ్‌రోబ్‌గా( Wardrobe ) భావించి దానిని కొన్నాడు.అది మార్బుల్ వర్క్, వుడ్ ఫినిషింగ్‌తో అందమైన ఫర్నిచర్‌గా కనిపించింది.దీనికి సంబంధించి గతంలో ఫొటోలు, వీడియోలు వైరలయ్యాయి.అయితే దీని లోపల ఒక పెద్ద నిధి( Treasure ) ఉంటుందని ఎవరూ ఊహించలేదు.
తాజాగా ఆ విషయం బయటపడింది.

నోడెల్ తాను కొనుగోలు చేసిన ఆ ఫర్నిచర్‌లో విలువైన డైమండ్స్, నగలు ఉన్నాయని వివరిస్తూ తాజాగా ఒక వీడియో షేర్ చేశాడు.అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.నోడెల్ తన డైనింగ్ రూమ్‌లో ఉపయోగించాలనే ఆలోచనతో దానిని కొనుగోలు చేశాడు.
అయితే దానిలో ఒక సీక్రెట్ డ్రాయర్( Secret Drawer ) ఉందనే విషయం చాలా ఏళ్ల పాటు తెలుసుకోలేకపోయాడు.చివరికి డ్రాయర్ గురించి తెలుసుకొని దానిని ఓపెన్ చేయగా అందులో అనేక రకాల కరెన్సీలు, నగలు, హెయిర్ లాక్, ఆర్మీ డాగ్ ట్యాగ్‌లు, కాగితపు డబ్బు, స్టాంపులు, సివిల్ వార్ మెమోరాబిలియా, చిన్న ట్రింకెట్‌లు ఉన్నాయి.

నోడెల్ ఈ వస్తువులను చూసి మొదటగా ఆశ్చర్యపోయాడు.తర్వాత ఎవరికో చెందినవైన ఆ వస్తువులను వారికే తిరిగి ఇవ్వాలని భావించాడు.అయితే ఈ విషయం గురించి ఎవరికీ తెలియకుండా ఆ సంపద తానే ఉంచుకున్నట్లయితే బాగుండు అని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు ఇతరుల సొమ్ముకు ఆశపడని నోడెల్ మనస్తత్వాన్ని పొగుడుతున్నారు.
ఈ వైరల్ వీడియో పై మీరు కూడా ఒక కన్నేయండి.







