నిమ్మ తోటలలో నల్ల నిమ్మ పురుగులను అరికట్టే పద్ధతులు..!

ఉద్యానవన తోటలలో ఒకటైన నిమ్మ తోటలకు ( Lemon Groves )మార్కెట్లో ఎప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది.కాకపోతే ఈ పంటను ఆశించే చీడపీడలను, తెగులను సకాలంలో గుర్తించి అరికట్టాలి.

 Methods To Prevent Black Lemon Insects In Lemon Orchards , Lemon , Farmers ,c-TeluguStop.com

నిమ్మ తోటలకు నల్లనిమ్మ పురుగుల బెడద చాలా ఎక్కువ.ఈ పురుగులు 30 కిలోమీటర్ల దూరం వరకు ఎగిరి వెళ్లి ఆహారాన్ని వెతుక్కుంటాయి.ఈ పురుగులు లేత గోధుమ రంగులో ఉండి నల్లటి శరీరాన్ని కలిగి ఉండి 1.5 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయి.పురుగులు పంటను ఆశిస్తే ప్రమాదకరమైన తెగుళ్లు పంటను ఆశిస్తాయి.

Telugu Agriculture, Crop, Farmers, Lemon, Weeds-Latest News - Telugu

ఈ పురుగులు ఆకులలో ఉండే కణద్రవ్యాన్ని పూర్తిగా పీల్చివేస్తాయి.దీంతో పుష్ప గుచ్ఛము, మొగ్గలు వంకర పోయి ఆకులు ఉంగరాలు తిరగడం లేదంటే చుట్టుకుపోవడం జరుగుతుంది.ఈ పురుగులు హనీ డ్యూ రూపంలో అధిక చక్కెరను విడుదల చేస్తాయి.

దీంతో బూజు శిలీంద్రాలు గుంపులుగా ఏర్పడి ఆకులు నల్లబడతాయి.నిమ్మపండ్ల ( Lemons )నాణ్యత పూర్తిగా తగ్గిపోతుంది.

Telugu Agriculture, Crop, Farmers, Lemon, Weeds-Latest News - Telugu

నాణ్యమైన సర్టిఫైడ్ కంపెనీల నుంచి ఎంపిక చేసిన విత్తనాలతో మాత్రమే సాగు చేపట్టాలి.ఈ పురుగుల నుంచి చెట్లను కాపాడడం కోసం వలలను ఉపయోగించాలి.ఎక్కువ నీటిని ఎక్కువ ఎరువులను చెట్లకు అందించకూడదు.పొలంలో కలుపు మొక్కలు( Weeds ) లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.మొక్క నుండి ఆఫిడ్స్ చేతితో తీసివేయాలి.ఏవైనా వ్యాధులు తొక్కిన మొక్కలు ఉంటే తోట నుంచి తొలగించాలి.

మొక్కలకు గాలి ప్రసరణ బాగా ఉండేందుకు చెట్లపై శాఖలను కత్తిరించి, మొక్కల దిగున ఉండే ఆకులను తొలగించాలి.తోటలలో తేమ వాతావరణ సమయంలో ఈ పురుగులు ఆశిస్తే ఫంగస్ నెయోజిగైట్స్ ఫ్రెసెన్సీ ఉపయోగించి వీటి జనాభాను అదుపు చేయవచ్చురసాయన పద్ధతిలో కృతిమ పెరిథ్రోయిడ్స్ ఉపయోగించి ఈ పురుగులను అరికట్టవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube