పిల్లులు( Cats ) చాలా తెలివైనవి.అవి కుక్కల కంటే ధైర్యం కలిగి ఉంటాయి.
దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు అనే క్లారిటీ వాటికి పూర్తిస్థాయిలో ఉంటుంది.అందుకే కొన్ని సందర్భాల్లో ఏ జంతువులు చూపని ధైర్యాన్ని చూపుతుంటాయి.
వాటి వల్ల ప్రమాదమేమీ లేదని తెలుపుతాయి.అంతే కాకుండా ఇవి చాలా క్యూరియస్ గా ఉంటాయి.
కొత్త వాటిని ట్రై చేయడానికి ఎప్పుడూ ఆసక్తిని చూపుతుంటాయి.తాజాగా ఒక పిల్లి కూడా చాలా క్యూరియాసిటీతో టాయ్ ట్రైన్ ఎక్కి ఎంజాయ్ చేసింది.

@Buitengebieden ట్విట్టర్ పేజీ ఈ వీడియోను పంచుకుంది.ఏడు సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో క్లిప్ కు ఇప్పటికే 10 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.30 వేల దాకా లైక్స్ వచ్చాయి.

ఈ వైరల్ వీడియో ఓపెన్ చేస్తే క్రిస్మస్ ట్రీ( Christmas tree ) చుట్టూ ఒక టాయ్ ట్రైన్ ట్రాక్ ఉంచడం మనం చూడవచ్చు.టాయ్ ట్రైన్ క్రిస్మస్ చెట్టు తిరుగుతూ ఉంటే దానిలోని ఒక బోగీలో పిల్లి ఎక్కి కూర్చుంది.ఈ క్రిస్మస్ ట్రీ చాలా పెద్దది.
టాయ్ ట్రైన్ ( Toy train )కూడా పెద్ద పిల్లి కూర్చునేంత పెద్దగా ఉంది.టాయ్ ట్రైన్ గుండ్రంగా తిరుగుతూ క్యాట్ ఎంజాయ్ చేయడం మనం చూడవచ్చు.
అది చాలా క్యూరియస్ గా చుట్టుపక్కల చూస్తూ ఉంది.క్రిస్మస్ ట్రీ చాలా చక్కగా డిజైన్ చేయడం కూడా మనం గమనించవచ్చు.
ఈ వాతావరణం ఆ పిల్లికి బాగా నచ్చేసినట్లుంది అందుకే అక్కడే టైం గడుపుతున్నట్టు తెలుస్తోంది.నిజానికి కుక్కలు లేదా వేరే ఇతర జంతువులు ఇలా గుండ్రంగా తిరిగే వాటిపై ఎక్కడానికి భయపడతాయి.
ఈ వీడియో చూసి చాలామంది నెటిజన్లు నవ్వుకుంటున్నారు.ఈ క్యాట్ చాలా స్మార్ట్ అని అంటున్నారు.
దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.







