టీడీపీ అధినేత చంద్రబాబుపై కర్నూలు జిల్లాకు చెందిన రాయలసీమ భాషా పరిరక్షణ సమితి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.ఈ మేరకు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది.
సాధారణంగా రాయలసీమ భాష, యాస అంటే విలక్షణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సీమ భాష అంటే తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టం.
అయితే అటువంటి భాషను చంద్రబాబు అవమానించడంపై కర్నూలు జిల్లాకు చెందిన రాయలసీమ భాషా పరిరక్షణ సమితి తీవ్రంగా ఖండించింది.
సీమ ప్రాంత వాసులు బంగాళదుంపలను ఉర్లగడ్డగానే పిలుస్తారన్న విషయం తెలిసిందే.
అయితే దాదాపు 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా ఉన్న చంద్రబాబుకు ఈ విషయం తెలియకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టారీతిన మాట్లాడటం సరికాదని పరిరక్షణ సమితి సభ్యులు మండిపడుతున్నారు.
తన స్వార్థ రాజకీయాల కోసం సీమ ప్రజల మనోభావాలను కించపరిచిన చంద్రబాబుకు రాజకీయ సమాధి కడతామని హెచ్చరికలు జారీ చేశారు.అదేవిధంగా రాయలసీమ ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో రాయలసీమ దెబ్బ ఏంటో తెలియజేస్తామని స్పష్టం చేశారు.







