తెలంగాణ కొత్త కేబినెట్ తొలి భేటీ నిర్వహించనుంది.ఈ మేరకు ఇవాళ సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.ఆరు గ్యారెంటీలను అమలు చేసే విధంగా చట్ట బద్ధత తీసుకువచ్చే విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
అలాగే ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించనున్నారు.అయితే డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేయగా మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.







