పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో లోక్ సభలో కేంద్రం రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది.
జమ్ముకశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్లు, జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది.అనంతరం అమిత్ షా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం తెచ్చిన ఈ బిల్లులు ఎవరికీ వ్యతిరేకం కాదని చెప్పారు.కొత్త చట్టం ప్రకారం కశ్మీర్ లో 47 అసెంబ్లీ సీట్లు, జమ్ములో 43 సీట్లతో పాటు పీవోకేలో 24 సీట్లను కేంద్రం రిజర్వ్ చేసిందని పేర్కొన్నారు.
అలాగే కశ్మీర్ పండిట్ల కోసం మరో రెండు సీట్లను కేటాయించిందని తెలిపారు.