ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దేవర”( Devara ).వరుసగా సూపర్ హిట్స్ తో దూసుకు పోతున్న ఎన్టీఆర్ కెరీర్ లో ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పాలి.
ఈ హిట్ తో ఎన్టీఆర్ మార్కెట్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది.ఈ మార్కెట్ ను తగ్గించుకోకుండా మరింత విస్తరించుకునేలా తన నెక్స్ట్ ప్రాజెక్టులు సెట్ చేసుకున్నాడు.
ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్టుల్లో దేవర ఒకటి.ఈ సినిమాను కొరటాల శివ కూడా బ్లాక్ బస్టర్ చేయాలనే పట్టుదలతో తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే షూట్ చాలా భాగం పూర్తి కాగా డిసెంబర్ తో మొత్తం పూర్తి చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు.
కాగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నట్టు తాజాగా సమాచారం అందుతుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి మెయిన్ క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్ లను రిలీజ్ చేసారు.ఎన్టీఆర్ తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ లుక్స్ ( Saif Ali Khan) రిలీజ్ అవ్వగా హైప్ పెరిగింది.
ఇక తాజాగా టీజర్ ను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.ఈ అప్డేట్ నిజం అయితే తారక్ ఫ్యాన్స్ కు ఇది పెద్ద పండగ అనే చెప్పాలి. ఫస్ట్ లుక్ టీజర్ (Devara Teaser) తో అంచనాలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది.చూడాలి దీనిపై అఫిషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో.కాగా ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఇక అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.