కొడుకుని కారుతో గుద్దిన తల్లి.. వీడియో వైరల్..

క్షణికావేశంలో కొందరు సరిగా ఆలోచించలేక పెద్ద ఘోరాలకు పాల్పడతారు.తాజాగా ఒక తల్లి కూడా ఆలోచించకుండా ఒక దారుణమైన పని చేసింది.

 Mother Accidentally Strikes Son With Car While Aiming For Boy Fighting Him Detai-TeluguStop.com

స్కూల్‌లో తన కొడుకుతో గొడవ పడుతున్న ఇతర అబ్బాయిలను చెదరగొట్టేందుకు ఎస్‌యూవీతో తన కొడుకును ప్రమాదవశాత్తు గాయపరిచింది.ఆ తల్లి పేరు క్వాంటావియా శామ్యూల్,( Quantavia Samuel ) తన కొడుకు పై దాడి చేస్తున్న అబ్బాయిలలో ఒకరి వద్ద తుపాకీ ఉందని, తన కుమారుడి భద్రత గురించి తాను ఆందోళన చెందుతున్నానని ఆమె పేర్కొంది.

సౌత్ ఫ్లోరిడాలోని( South Florida ) జెస్సీ జె.మెక్‌క్రారీ, జూనియర్ ఎలిమెంటరీ స్కూల్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది.శామ్యూల్ 12 ఏళ్ల కుమారుడు తన తల్లికి ఫోన్ చేసి, ఇతర విద్యార్థులు తనపై అటాక్ చేస్తున్నారని చెప్పాడు, అతను పోగొట్టుకున్న తన పుస్తకాల బ్యాగ్ కోసం తిరిగి పాఠశాలకు వెళ్లాడు.శామ్యూల్ తన కొడుకు ఫోన్ చేయగానే వెంటనే స్కూల్ కి చేరుకుంది.

పిల్లలను భయపెట్టాలని ఆశతో ఆమె ఎస్‌యూవీని( SUV ) వారి మీదకు నడిపింది.

అయితే, దురదృష్టవశాత్తు ఇతర పిల్లలకు బదులుగా తన కొడుకును ఢీకొట్టింది, ఈ ప్రమాదంలో అతని కాలు, తుంటికి స్వల్ప గాయాలయ్యాయి.శామ్యూల్ తన కొడుకును కారులో ఎక్కించుకుని, అబ్బాయిలను అనుసరించి వారి ఇంటికి వెళ్ళింది, అక్కడ ఆమె పోలీసులకు కాల్ చేసింది.పోలీసులు( Police ) అక్కడికి చేరుకుని అబ్బాయిలను వెతికినా తుపాకీ ( Gun ) దొరకలేదు.

అలాగే శామ్యూల్ కుమారుడిని చికిత్స నిమిత్తం జాక్సన్ మెమోరియల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.శామ్యూల్ ను పోలీసులు అరెస్టు చేశారు.

తన కుమారుడిని లేదా ఇతర పిల్లలను బాధపెట్టడం తన ఉద్దేశ్యం కాదని, అతన్ని రక్షించాలని మాత్రమే కోరుకుంటున్నానని ఆమె న్యాయస్థానంలో చెప్పింది.క్షణికావేశంలో తప్పు చేశానని ఆమె లాయర్ సమర్థించుకున్నారు.అయితే ఇలా కాదు గుద్దడం కంటే పిల్లలను శాంతియుతంగా విడిపిస్తే బాగుండేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube