పసుపు ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎవరెవరు తీసుకోకూడదో తెలుసా?

పసుపు.( Turmeric ).దీని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.నిత్యం మనం వంటల్లో వాడే మసాలా దినుసుల్లో పసుపు ఒకటి.

 Do You Know Who Should Not Take Turmeric , Turmeric, Turmeric Benefits, K-TeluguStop.com

ఆహారానికి చక్కని రుచి, కలర్ ను అందించడానికి పసుపు స‌హాయ‌ప‌డుతుంది.అలాగే పసుపులో అనేక రకాల పోషకాలతో పాటు ఔషధ గుణాలు నిండి ఉంటాయి.

అందువల్ల ఆరోగ్యపరంగా పసుపు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.పసుపును తీసుకోవడం వల్ల ఎన్నో జబ్బులకు దూరంగా ఉండవచ్చు.

అయితే పసుపు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.కొందరు మాత్రం దానికి దూరంగా ఉంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరి పసుపును ఎవరెవరు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Latest, Turmeric-Telugu Health

పసుపులోని కర్కుమిన్ అనే సమ్మేళనం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.నిత్యం పసుపు తీసుకుంటే మధుమేహం( Diabetes ) వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది.కానీ మధుమేహం ఉన్నవారు మాత్రం పసుపును ఎవైడ్ చేయడమే మంచిది.

ఎందుకంటే మధుమేహం వ్యాధిగ్రస్తులకు వైద్యులు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, రక్తం పల్చగా ఉండడానికి మందులు ఇస్తారు.అటువంటి పరిస్థితిలో పసుపును అధికంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు మరింత దిగజారి పోతాయి.

దాంతో లేనిపోని సమస్యలు తలెత్తుతాయి.

Telugu Tips, Latest, Turmeric-Telugu Health

అలాగే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు పసుపును తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.పసుపును తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ సమస్య( Kidney stones problem ) మరింత అధికం అవుతుంది.కొందరికి శరీరంలో అధిక వేడి కారణంగా ముక్కులో నుంచి రక్తం కారుతుంది.

అలాంటి వారు కూడా పసుపును తీసుకోకూడదు.ఎందుకంటే పసుపు వేడి చేసే లక్షణాలను కలిగి ఉంటుంది.

పసుపును తీసుకుంటే సమస్య రెట్టింపు అవుతుంది.ఐరన్ లోపం ఉన్నవారు పసుపును తీసుకోకపోవడం మంచిది.

పసుపును అధికంగా వాడటం వల్ల ఐరన్ కంటెంట్ తగ్గుతుంది.రక్తహీనత సమస్య ఏర్పడుతుంది.

ఇక ఆరోగ్యానికి మంచిదనే కారణంతో పసుపును అధికంగా వాడితే కడుపు నొప్పి, ( Stomach ache )తలనొప్పి, తల తిరగడం, జ్ఞాపక శక్తి తగ్గడం, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.కాబట్టి ఎంత మంచిది అయినప్పటికీ పసుపును మితంగానే తీసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube