రద్దీగా ఉండే రోడ్డుపై చాలా జాగ్రత్తగా ఉండాలి.అన్ని వైపులా చూసుకుంటూ రైడ్ చేయాలి.
ఇలాంటి రోడ్లపై స్టంట్స్ చేయడం కంటే మరొక మూర్ఖత్వపు పని ఉండదు, తాజాగా ఒక రైడర్ ఇలాంటి పిచ్చి పనే చేసి చివరికి అందరి చేత తిట్లు తింటున్నాడు.ఈ వ్యక్తి నిర్లక్ష్యంగా బైక్ రైడ్ చేస్తున్న వీడియో ఎక్స్‌లో వైరల్‌గా మారడంతో నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వీడియో ప్రకారం రైడర్( Rider )తన రెండు కాళ్లను వెనుక సీటుపై పెట్టి స్కూటర్ హ్యాండిల్‌ను అటు ఇటు తిప్పుతూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు.ఇతర వాహనాలను దాటుతూ కూడా ఉన్నాడు.

అతను హెల్మెట్ లేదా మరే ఇతర సేఫ్టీ గేర్ ధరించలేదు.అలా వెళ్తున్న సమయంలో అతను పట్టును కోల్పోయి బైక్ ( Bike )నుంచి పడిపోయాడు.దాంతో రహదారిపై జారుతూ ముందుకు దూసుకుపోయాడు.ఈ ఘటనలో అతనికి బాగానే గాయాలైనట్లు తెలుస్తోంది.స్కూటర్ కూడా కొద్దిగా పాడయింది.ఇతడి పక్కనే వెళ్తున్నా ఒక ప్రయాణికుడు ఈ వీడియోని రికార్డ్ చేశాడు ఆ వీడియో ( Viral video )చివర్లో సదరు యువకుడు కింద పడిన తర్వాత కూడా లేచి వెళ్లి తన స్కూటర్ పికప్ చేసుకోవడం కనిపించింది.

ఈ వీడియో డిసెంబర్ 1న అప్‌లోడ్ చేయగా, ఆన్‌లైన్ యూజర్ల నుంచి చాలా నెగిటివ్ కామెంట్స్( Negative comments ) వచ్చాయి.చాలా మంది రైడర్ తన ప్రాణాలకు, రోడ్డుపై ఇతరుల ప్రాణాలకు హాని కలిగించడాన్ని ఖండించారు.ఇలాంటి వారిని పట్టుకుని డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి, మళ్లీ రోడ్లపై డ్రైవ్ చేయకుండా ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు కోరారు. స్కూటర్ సీజ్ చేసి భారీగా ఫైన్ వేస్తే ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడూ చేయరని మరికొందరున్నారు.
రైడర్ మరెవరినీ ఢీకొట్టలేదని కొంతమంది యూజర్లు రిలీఫ్ వ్యక్తం చేశారు.







