ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్( Bigg Boss House ) లో ఉన్న కంటెస్టెంట్స్ లో అందరూ బాగానే ఆడారు, ఒక్క రతికా తప్ప.అలా చూస్తూ ఉండగానే 12 వారాలు పూర్తి చేసుకున్న ఈ సీజన్, ఇప్పుడు 13 వ వారం లోకి అడుగుపెట్టింది.
గత వారం లో రతికా మరియు అశ్విని డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా ఎలిమినేట్ అయ్యారు.ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి ఒక్క అమర్ దీప్ మినహా, మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ నామినేట్ అయ్యారు.
ఈ వారం నామినేషన్స్ ప్రభావం అంబటి అర్జున్( Arjun ) పై చాలా తీవ్ర స్థాయిలో పడింది.అందువల్ల ఆయన డేంజర్ జోన్ లో ఉన్నాడు.
సోషల్ మీడియా లో జరిగిన అన్నీ పొలింగ్స్ ప్రకారం చూస్తే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళబోయేది అర్జున్ అట.అద్భుతంగా ఆడే ఒక కంటెస్టెంట్, గోడమీద పిల్లి లాగ వ్యవహరించడం తో ఎలిమినేషన్ కి దగ్గరగా వచ్చాడని అంటున్నారు విశ్లేషకులు.

అర్జున్ పరిస్థితి అలా ఉంటే, ఈ వారం ప్రియాంక జైన్( Priyanka Jain ) కి అద్భుతమైన పాజిటివ్ ఎపిసోడ్ అనే చెప్పాలి. ‘టికెట్ టు ఫినాలే’( Ticket to Finale ) టాస్కులో ఆమె మగవాళ్ళతో సమానంగా పోటీ పడి ఆడడం అందరినీ షాక్ కి గురి చేసింది.ముఖ్యంగా తన బెస్ట్ ఫ్రెండ్ అమర్ దీప్ తో నిన్న గెలవడానికి ఆమె చేసిన పోరాటం ఆడవాళ్లు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు అనే దానికి ఉదాహరణ అని చెప్పొచ్చు.సోషల్ మీడియా లో ఆమె ఫాలోయింగ్ రాత్రికి రాత్రి ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకొని ఓటింగ్ లైన్ లో టాప్ 2 స్థానం ని సొంతం చేసుకుంది.
ఈ ఎపిసోడ్ కి ముందు ప్రియాంక కి శోభా శెట్టి కంటే తక్కువ ఓట్లు నమోదు అయ్యాయి అట.కానీ ఈ ఎపిసోడ్ తర్వాత ఆమె శోభా శెట్టి ని మాత్రమే కాదు, శివాజీ( Shivaji ) ని కూడా ఓటింగ్ లో దాటేసింది అట.

ఇది ఇలా ఉండగా అర్జున్ తర్వాత తక్కువ ఓటింగ్ తో కొనసాగుతున్న కంటెస్టెంట్ గౌతమ్ అట.నామినేషన్స్ లో శివాజీ మీద సిల్లీ పాయింట్స్ తో నామినేట్ చెయ్యడం, గత మూడు వారాల నుండి టాస్కులు ఆడే విషయం లో బాగా వెనకబడడం వంటివి జరిగాయి.అందుకే గౌతమ్ గ్రాఫ్ బాగా తగ్గిపోయింది.వీకెండ్ లో ఎలిమినేషన్ రౌండ్ లో వీళ్ళిద్దరూ ఉండే అవకాశం ఉంది.మరి ఈ ఇద్దరు ఎలిమినేషన్ రౌండ్ లోకి వస్తే పల్లవి ప్రశాంత్ అర్జున్ ని సేవ్ చేస్తాడా?, లేదా గౌతమ్ ని సేవ్ చేస్తాడా?.ఈ రెండూ కాకుండా ముందుగా చెప్పినట్టుగానే 14 వ వారం వరకు ఉపయోగించడా? అనేది తెలియాల్సి ఉంది.