తెలంగాణలోని రైతులకు రైతుబంధు నిధుల విడుదలను నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల అధికారిని బీఆర్ఎస్ నేతల బృందం కలిశారు.
ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ నేతలు విన్నవించారు.రాష్ట్ర రైతాంగానికి నగదు బదిలీ చేసే సమయంలో కోడ్ నిబంధనలు అంటూ ఎన్నికల కమీషన్ ఈ పథకాన్ని నిలిపివేస్తూ ఇచ్చిన ఆర్డర్స్ ను వెనక్కి తీసుకోవాలని కోరారు.
రైతుబంధు నిధులు విడుదలకు ముందు అనుమతిని ఇచ్చి మళ్లీ రద్దు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు.ఈసీ నిర్ణయం కారణంగా సుమారు 4 కోట్ల మంది రైతులకు నష్టం కలుగుతుందని తెలిపారు.
న్యాయస్థానానికి వెళ్లేందుకు సమయం సరిపోదని ఈ పక్షంలోనే రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసినట్లు బీఆర్ఎస్ నేతల బృందం వెల్లడించింది.