ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు.ఇందులో భాగంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈనెల 25న తెలంగాణలో పర్యటించనున్నారు.
ఈ మేరకు మొత్తం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.బోధన్, ఆదిలాబాద్ తో పాటు వేములవాడలో ప్రచారం చేయనున్న ఆయన అక్కడ కాంగ్రెస్ ఏర్పాటు చేసే సభల్లో పాల్గొననున్నారు.
ముందుగా నాందేడ్ నుంచి బోధన్ కు రానున్న రాహుల్ గాంధీ ప్రచార సభలో పాల్గొంటారు.తరువాత మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ బహిరంగ సభకు హాజరుకానున్నారు.
సాయంత్రం 4 గంటలకు వేములవాడకు వెళ్లనున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్ధతుగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు.అయితే ఇప్పటికే రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.







