సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటు ఒక ప్రత్యేకత ను సంపాదించుకోవడం కోసం సినిమా ఇండస్ట్రీలో అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి సమయంలో చాలామంది డైరెక్టర్లు( Directors ) వాళ్లకంటు ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి వాళ్ళు తీసే సినిమాల మీద హెవీ ఫోకస్ పెడుతూ ఉంటారు.
ఇక ఇలాంటి క్రమంలోనే దర్శకులు చాలా ఎక్కువ రిస్క్ తీసుకొని సినిమాల మీద ప్రొడ్యూసర్ల చేత చాలా ఖర్చు పెట్టిస్తు ఉంటారు.ఇక గత ఏడాది సీతా రామం అనే సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన హను రాఘవపూడి( Hanu Raghavapudi ) ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు.
ఆ సినిమా బడ్జెట్ కూడా 200 కోట్ల పైనే అవుతుందని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తుంది.

ఇక ప్రభాస్ ఇప్పటికే రాదేశ్యామ్( Radeshyam ) లాంటి సినిమాల పైన భారీ బడ్జెట్ పెట్టి భారీగా నష్టపోయారు.ఇంకా ఇప్పుడు ఈ సినిమాతో కూడా భారీ బడ్జెట్ పెట్టడం ఎందుకు అని ట్రేడ్ పండితులు సైతం అభిప్రాయ పడుతున్నారు.అయితే కంటెంట్ పరంగా పెట్టాల్సినప్పుడు పెట్టాలి కానీ భారీ హంగులకు పోయి కథలో దమ్ము లేకపోయిన కూడా భారీ గా ఖర్చు పెట్టడం వల్ల ప్రొడ్యూసర్ కు భారీగా నష్టం వస్తుంది.

కాబట్టి ప్రభాస్ సినిమాలో డబ్బులు పెట్టేటప్పుడు ఆలోచించుకొని డబ్బులు పెడితే మంచిది అని ప్రభాస్ కి అందరూ సలహాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే హను రాఘవ పూడి ఒక బి గ్రేట్ డైరెక్టర్ ఆయన ప్రభాస్( Prabhas ) లాంటి ఒక స్టార్ హీరోను డైరెక్షన్ చేయాలంటే అది ఎంతవరకు సాధ్యం అనేది ముందే ప్రభాస్ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది…ఇక ప్రభాస్ తో సినిమా చేసే ప్రొడ్యూసర్లు కూడా ఆలోచించుకొని డబ్బులు పెడితే మంచిదనే ట్రేడ్ పండితులు ప్రొడ్యూసర్లు సలహాలు ఇవ్వడం జరుగుతుంది…
.







