తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజా గా పేరుపొందిన రవితేజ ( Ravi teja )గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది.
ప్రతి సినిమాకి ఒక ప్రత్యేక పాత్రలను ఎంచుకుంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి.

ఇక అందులో భాగంగానే ప్రస్తుతం గోపీచంద్ మలినేని( Gopichand Malineni ) డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నాడు.ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పటికే డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి సినిమాలు వచ్చి మంచి విజయాలను సాధించాయి.అయితే ఇక వీళ్ళ కాంభినేషన్ లో ఇప్పుడు వస్తున్న సినిమాలో రవితేజ రాయలసీమ యాస లో మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇంతకుముందు చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించిన రవితేజ ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడి బాగా నటించి మెప్పించాడు.
ఇక ఇప్పుడూ ఈ సినిమాలో రాయలసీమ యాసలో నటించడానికి రెడీ అవుతున్నాడు.ఇక ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమాలో రాయలసీమ యాస లో నటించాడు.

అలాగే పుష్ప సినిమాలో( Pushpa movie ) అల్లు అర్జున్ కూడా రాయలసీమ యాస లో నటించి మెప్పించాడు.ఇక ఇప్పుడూ వాళ్ళ బాటలోనే రవితేజ ( Ravi teja )కూడా నటించి మెప్పించాలని చూస్తున్నాడు.ఇక వీళ్ళ కాంబో పైన ఇప్పటికే విపరీతమైన అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాతో సక్సెస్ కొడితే వరుసగా నాలుగు సినిమాలతో సక్సెస్ కొట్టిన బెస్ట్ జోడిగా వీళ్ళ కాంబో అనేది రికార్డు క్రియేట్ చేస్తుంది…ఇక అందుకే వీళ్ళు మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు గా తెలుస్తుంది…ఇక ఈ సినిమాతో గోపిచంద్ మలినేని మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు…
.







