తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన మ్యానిఫెస్టోపై బీజేపీ నేత బండి సంజయ్ సెటైర్లు వేశారు.పెద్దపల్లి జిల్లాలోని కమాన్ పూర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ నేతలు ఇస్తున్న హామీలను అమలు చేయడానికి కేంద్రంలోని బడ్జెట్ కూడా సరిపోదని బండి సంజయ్ తెలిపారు.కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినా తరువాత బీఆర్ఎస్ లోకే వెళ్తారని చెప్పారు.
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులమయం చేశారన్న ఆయన ప్రతి ఒక్కరిపై రూ.లక్షా ఇరవై వేల అప్పు ఉందని పేర్కొన్నారు.కేసీఆర్ మరోసారి వస్తే అప్పులు మరింత పెరుగుతాయని విమర్శించారు.అలాగే కాంగ్రెస్ హామీల వర్షం కురిపిస్తుంది కానీ అప్పులను ఎలా తీరుస్తుందో మాత్రం చెప్పడం లేదని దుయ్యబట్టారు.







