బైండోవర్ ను తక్కువ అంచనా వేస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు వేములవాడ డిఎస్పీ నాగేంద్ర చారీ ( DSP Nagendra Chari )రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామానికి చెందిన కడారి తిరుపతి కి బైండోవర్ లో సూచించిన జరిమానా విధించటం జరిగింది అని వేములవాడ డి ఎస్పీ నాగేంద్ర చారీ తెలిపారు.డీఎస్పీ తెలిపిన వివరాలు ప్రకారం గత రెండు నెలల క్రితం రాబోవు ఎలక్షన్ లను ద్రుష్టి లో పెట్టుకొని ముందస్తు గా నేర చరిత కలిగిన కడారి తిరుపతి( Tirupati ) ని వేములవాడ రూరల్ తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేయటం జరిగింది.
బైండోవర్ జరిగి అందులో నిర్ణయించిన గడువు 6 నెలల లోపు ఎలాంటి కేసులు చేసుకున్న అందులో నిర్ణయించిన షూరిటీ మొత్తం లక్ష రూపాయలు జరిమానా చెల్లించవలసి ఉంటుంది.ఇటీవల ఓటర్ల ను మభ్యపెట్టుటకు ఎదురుగట్ల లో మహిళా ఓటర్లకు చీరలు పంపిణీ చేసిన కేసులో తిరుపతి నిందితుడిగా ఉన్నడు.
కాబట్టి అతని పై బైండోవర్ సమయం లోపల మరొక్క కేసు అయినందున రూరల్ తహసీల్దార్ కి తదుపరి చర్యలు తీసుకొమ్మని కోరగా జరిమానా విధించటం జరిగింది.ఈ సందర్బంగా డి ఎస్పీ నాగేంద్ర చారీ మాట్లాడుతూ త్వరలో జరగబోవు ఎలక్షన్ లని దృష్టిలో పెట్టుకొని వేములవాడ సబ్ డివిజన్ పరిధిలో గల నేర చరిత, ఎలక్షన్ సమయం లో శాంతి భద్రత లకు విఘాతం కలిగించే వ్యక్తుల ను మరియు మరి కొంతమంది ని ముందస్తు బైండోవర్ చేయటం జరిగింది అని ప్రతీ ఒక్కరు శాంతి యుత వాతావరణం లో ఎన్నికల నిర్వహణ కి సహకరించాలి అని నిబంధనలు అతిక్రమించి అనవసరం గా కేసులు చేసుకోవద్దు అని సూచించారు.







