టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి.
విచారణలో భాగంగా సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించగా చంద్రబాబు తరపున ప్రముఖ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.ఈ క్రమంలోనే చంద్రబాబు తప్పుడు హెల్త్ రిపోర్టులు సమర్పించారని ఏఏజీ పొన్నవోలు కోర్టుకు తెలిపారు.
అయితే ఏఏజీ వాదనలపై అభ్యంతరం వ్యక్తం చేసిన సిద్దార్థ్ లూథ్రా ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యని పేర్కొన్నారు.చంద్రబాబును ఇరికించడానికే ఫోరెన్సిక్ రిపోర్ట్ తయారు చేయించారని కోర్టుకు తెలిపారు.
ఈ క్రమంలోనే ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.







