తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం మరింత దగ్గర పడిన నేపథ్యంలో బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తుంది.ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు.
ఇందులో భాగంగా ఈనెల 18న అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్నారు.బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న అమిత్ షా ఒకే రోజు మూడు బహిరంగ సభలకు హాజరుకానున్నారు.
కాగా ఈ బహిరంగ సభలకు సకల జనుల సంకల్ప సభగా బీజేపీ నామకరణం చేసింది.ముందుగా గద్వాల నియోజకవర్గంలో ఉదయం 10 గంటలకు, నల్గొండ పట్టణంలో మధ్యాహ్నం 12 గంటలకు సభల్లో అమిత్ షా పాల్గొననున్నారు.
తరువాత మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ తూర్పు నియోజకవర్గం కోటలో జరిగే సభలో ఆయన పాల్గొంటారు.ఈ క్రమంలోనే 18వ తేదీ సాయంత్రం బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది.