కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీశ్ రావు విమర్శలు చేశారు.ఓటమి భయంతో కాంగ్రెస్ తప్పు మీద తప్పు చేస్తోందని చెప్పారు.
హార్స్ పవర్ అంటే కనీస జ్ఞానం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో రైతులకు రెండు గంటలు కూడా కరెంట్ రావడం లేదని అక్కడి మాజీ సీఎం కుమారస్వామి చెప్తున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
రాష్ట్రానికి కావాల్సింది బూతులు మాట్లాడే నేతలు కాదని పేర్కొన్నారు.రాష్ట్రానికి దశ, దిశ చూపించిన వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు.
కేసీఆర్ అంటే నమ్మకం, భరోసా అని వెల్లడించారు.