గుణశేఖర్( Gunasekhar ) తీసిన సినిమాలు అప్పట్లో మంచి విజయాలను అందుకున్నాయి.అందుకే ఆయన చాలా కాలం పాటు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగాడు.
అయితే ఈయన తీసిన సినిమాల్లో చూడాలని ఉంది, ఒక్కడు సినిమాలు మాత్రం చాలా స్పెషల్ సినిమాలనే చెప్పాలి.ఈ రెండు సినిమాలకి ఆయన దగ్గరుండి మరి స్క్రిప్ట్ వర్క్ లు చేసుకొని భారీ సక్సెస్ కొట్టారు.
అయినప్పటికీ ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఆయన ఇండస్ట్రీలో ప్లాప్ డైరెక్ట ర్ గా మిగిలిపోయాడు.ఇక రీసెంట్ గా శాకుంతలం( Shaakunthalam ) అనే సినిమా తీసినప్పటికీ అది పెద్దగా ఆడలేదు.
ప్రస్తుతం ఆయన రానా తో దుష్యంతుడు అనే ఒక సినిమా చేద్దామనుకున్నప్పటికీ రానా వేరే వాళ్ళతో దుష్యంతుడు అనే సినిమా చేస్తున్నాడు ఇక దానితో ఆయన ఏ సినిమా చేయాలో తెలియక ప్రస్తుతం సతమతంలో ఉన్నాడు.
ఇక ఈయన సినిమా చేస్తాడా, లేదా అనే విషయం పక్కన పెడితే శాకుంతలం సినిమాతో మాత్రం దిల్ రాజుకి భారీ నష్టాలు వచ్చాయి.ఈ సినిమా మీద దిల్ రాజు( Dil Raju ) భారీగా ఖర్చుపెట్టినప్పటికీ అసలు ఎవరిని ఇంప్రెస్ చేయకపోవడంతో 3 సినిమా డిజాస్టర్ గా మిగిలింది.ప్రస్తుతం గుణశేఖర్ సినిమాలు చేయకుండా ఖాళీగా ఉంటేనే బెటర్ అని సిని మేధావులు సైతం సలహాలిస్తున్నారు ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండడంతో ఆయన సినిమాలు చేయడం వల్ల ప్రొడ్యూసర్స్( Producers ) నష్టపోతున్నారు తప్ప ఆయన మాత్రం సక్సెస్ కొట్టడం లేదు.
ఆయన ఫామ్ కోల్పోయి దాదాపు 15 సంవత్సరాలు దాకా అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆయనతో సినిమాలు చేయడం కూడా వేస్ట్ అని ప్రొడ్యూసర్లు కూడా వెనుకడుగు వేస్తున్నారు.రీసెంట్ గా ఒక స్టార్ ప్రొడ్యూసర్ దగ్గరికి కథ చెప్పడానికి వెళ్తే ఆ ప్రొడ్యూసర్ ఇంట్లో ఉండి కూడా లేడు అని చెప్పి ఆయన తీవ్రంగా అవమానించాడని తెలుస్తుంది.ఇక దానితో ఆయన తీవ్ర మనస్థాపనికు గురైనట్టుగా తెలుస్తోంది…
.