తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ఇండస్ట్రీలో ఆయన సినిమాల ద్వారా ఎంత పెద్ద సక్సెస్ సాధించాడో మనందరికీ తెలుసు…ఇక నటులందరి కంటే కూడా మెగాస్టార్ గా గుర్తింపు పొంది తనదైన మేటి నటనతో ఇండస్ట్రీలో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు.
ఇక ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్( box office ) వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.ఇక ఆయన కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందాడు.

అయితే తను ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో చిరుత, రచ్చ లాంటి సినిమాలు చేసినప్పుడు ఆ సినిమాలో నటించిన కొంతమంది సీనియర్ నటులు రామ్ చరణ్ ని అవమానించినట్టుగా తెలుస్తుంది.ఏంటి అంటే మెగాస్టార్ కొడుకు అయితే ఎవరైనా హీరో అవ్వచ్చు అన్నట్టుగా ఎగతాళి చేసి మాట్లాడారు.ఇక దాన్ని సీరియస్ గా తీసుకున్న రామ్ చరణ్ రంగస్థలం( rangasthalam ) త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలలో తనదైన నట విశ్వరూపాన్ని చూపిస్తూ ఇండస్ట్రీలో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇవ్వడమే కాకుండా పలు రకాల అవార్డ్ లు కూడా అందుకున్నాడు.

దాంతో ఇప్పుడు ఆ సీనియర్ నటులకి బుద్ధి చెప్పినట్లుగా అయిందంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.నిజానికి రామ్ చరణ్ చాలా కష్టపడతాడు అందుకే ఆయనకు సక్సెస్ అనేది దక్కింది.అంతే కానీ చిరంజీవి కొడుకు అయినంత మాత్రన హిట్ సినిమాలు రాలేదు అనేది మాత్రం వాస్తవం…కష్టపడితేనే ఇక్కడ చాలా రోజులపాటు హీరోగా కొనసాగుతాం లేకపోతే మాత్రం షెడ్డు కి పోవాల్సిందే అని చాలా మంది మెగా అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు…ఇక ఇలాంటి క్రమంలో రామ్ చరణ్ ఎదుగుదల చాలా మంది కి సమాధానం చెప్పిందంటు పలువురు కామెంట్స్ చేస్తున్నారు.