తెలంగాణ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ( Congress party )నే బలమైన ప్రత్యర్థిగా మరాబోతుందా ? అందుకే బిఆర్‌ఎస్ మరియు బీజేపీ పార్టీ( BJP party )లు కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తున్నాయా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఆ మద్య రాష్ట్రంలో పూర్తిగా డీలా పడిన హస్తం పార్టీ కర్నాటక ఎన్నికల్లో విజయం తరువాత వేగంగా పుంజుకుంది.
తెలంగాణలో కూడా విజయం కోసం తెగ అరతపడుతోంది.ప్రస్తుతం ఇతర పార్టీల నుంచి వలసలు కూడా కాంగ్రెస్ లోకి భారీగా పెరగడంతో హస్తం పార్టీ క్యాడర్ లో కొత్త జోష్ కనిపిస్తోంది.
ప్రస్తుతం ఉన్న ఊపును బట్టి ఈసారి ఎన్నికల్లో 70-80 స్థానాల్లో విజయం సాధిస్తామని హస్తం పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అధికార బిఆర్‌ఎస్ మరియు బీజేపీ పార్టీలు టార్గెట్ కాంగ్రెస్ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.ఎందుకంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు టార్గెట్ గా ఐటీ దాడులు జరుగుతున్నా సంగతి తెలిసిందే.అయితే అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ నేతలను కాదని కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు జరగడం ఏంటని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
దీన్ని బట్టి చూస్తే బిఆర్‌ఎస్ మరియు బీజేపీ మద్య ఉన్న సత్సంబంధాల కారణంగానే దర్యాప్తు సంస్థలు కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తున్నారనేది వారి వాదన.
కాగా ఆ మద్య డిల్లీ లిక్కర్ స్కామ్( Delhi Liquor Scam ) విషయంలో ఎమ్మెల్సీ కవితపై పలు మార్లు విచారణ ఎదురైనప్పటికి ఆ కేసు ప్రస్తుతం ఎందుకు హోల్డ్ పడిందనేది మిస్టరీగానే ఉంది.మరి అలాంటి కుంబకోణాలు ఉన్న బిఆర్‌ఎస్ నేతలను వదిలి కాంగ్రెస్ నేతలు టార్గెట్ గా ప్రస్తుతం జరుగుతున్నా ఐటీ దాడులు.కాంగ్రెస్ ఎన్నికల్లో దెబ్బతీసేందుకే అనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.మొత్తానికి అటు బిఆర్‌ఎస్ మరియు ఇటు బీజేపీ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ కు పెట్టె ప్లాన్ లో ఉన్నాయనేది హస్తం కాంపౌండ్ నుంచి వినిపిస్తున్నామాట.ఈ వాటన్నిటిని ఎదుర్కోవడానికి హస్తం పార్టీ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందో చూడాలి.