ఆ మెగా మూవీ ప్రమోషన్‌ ఇంకా మొదలు పెట్టరేం..!

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీలీల ( Sreeleela )హీరోయిన్ గా శ్రీకాంత్‌ ఎన్ రెడ్డి దర్శకత్వం లో రూపొందిన ఆదికేశవ సినిమా( Aadikeshava ) ను ఈ ఆగస్టు లోనే విడుదల చేయాలని భావించినప్పటికి కొన్ని కారణాల వల్ల విడుదల సాధ్యం కాలేదు.ఇక దీపావళి సందర్భంగా ఈ వారం విడుదల చేస్తామంటూ నిర్మాత ఆ మధ్య ప్రకటించాడు.

 Hero Vaishnav Tej Movie Adikeshava Promotions , Aadikeshava, Sreeleela , Hi-TeluguStop.com

కానీ ఈ దీపావళికి కూడా సినిమాను విడుదల చేయలేదు.ఎట్టకేలకు ఈనెల చివరి వారంలో అంటే నవంబర్‌ 24న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

అయితే ఇప్పటి వరకు సినిమా కు సంబంధించిన ప్రమోషన్ హడావుడి మొదలు అవ్వలేదు. వచ్చే నెలలో విడుదల అవ్వబోతున్న హాయ్ నాన్న( Hi Nanna ) సినిమాకు చాలా అగ్రెసివ్‌ గా నాని అండ్ టీమ్ ప్రచారం చేస్తున్నారు.కానీ ఇప్పటి వరకు వైష్ణవ్ తేజ్( Vaishnav Tej ) సినిమాకు మాత్రం ప్రమోషన్‌ చేయడం లేదు అంటూ మెగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌ లో ఈ సినిమా ను నాగ వంశీ నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా కు త్రివిక్రమ్‌ భార్య అయిన సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ప్రముఖ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా కు ఇప్పటి వరకు మినిమం బజ్ క్రియేట్‌ కాకపోవడం పట్ల చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియా ( Social media )లో మెగా ఫ్యాన్స్ పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.ఉప్పెన సినిమా ( Uppena )తో ఒక్కసారిగా స్టార్‌ ఇమేజ్ ను సొంతం చేసుకున్న వైష్ణవ్‌ తేజ్‌ ఆ తర్వాత చేసిన కొండపొలం, రంగ రంగ వైభవంగా సినిమా లు నిరాశ పరిచాయి.

దాంతో ఈ సినిమా పై ఆయన మరియు మెగా ఫ్యాన్స్‌ ఇంకా మెగా ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఆసక్తి పెంచుకుని వెయిట్‌ చేస్తున్నారు.మరి ప్రచారం చేయకుండా ఫలితం ఆశించడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ కొందరు విమర్శిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube