ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకు సంబంధించి ఊహించని స్థాయిలో లీక్స్( Movie Leaks ) వస్తున్నాయి.సాంగ్స్, సీన్స్ లీక్ అవుతుండటంతో ఫ్యాన్స్ నిర్మాతలకు భారీగా నష్టం వాటిల్లుతోంది.
సలార్, గేమ్ ఛేంజర్, గుంటూరు కారం సినిమాలను లీక్స్ ఒకింత ఇబ్బంది పెట్టాయి.అయితే ఈ విషయంలో దేవర సినిమా( Devara Movie ) గ్రేట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
దేవర సినిమాకు సంబంధించి ఒకటి రెండు పోస్టర్లు లీకైనా ఆ పోస్టర్ల వల్ల నష్టం కలగలేదు.
అదే సమయంలో చాలా పెద్ద సినిమాలకు సంబంధించి రిలీజ్ డేట్లను ప్రకటించినా ఆ సినిమాలు ఆ సమయానికి రిలీజ్ కావడం లేదు.
అయితే దేవర సినిమా మాత్రం అనుకున్న ప్రకారం షూటింగ్ ను( Devara Shooting ) పూర్తి చేసుకోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.దేవర సినిమా కలెక్షన్ల విషయంలో కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) కొరటాల శివ( Koratala Siva ) సమిష్టి కృషి వల్లే ఈ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించే ఛాన్స్ అయితే ఉందని మరి కొందరు చెబుతున్నారు.మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దేవర సినిమాను నిర్మిస్తున్నారు.దేవర సినిమాలో యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

2024 సంవత్సరంలో దేవర 1( Devara 1 ) రిలీజ్ కానుండగా దేవర 2( Devara 2 ) మాత్రం 2026 సంవత్సరం లేదా 2027 సంవత్సరంలో రిలీజయ్యే ఛాన్స్ ఉంది.దేవర సినిమా సాంగ్స్ కోసం అనిరుధ్ ( Anirudh ) ఎంతగానో కష్టపడ్డారని సమాచారం అందుతోంది.ఎన్టీఆర్ సినిమాల రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దేవర సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.







