రవితేజ 'ఈగల్' టీజర్.. లుంగీ కట్టి, తుపాకీ పట్టి మాస్ లుక్ లో రవితేజ!

మాస్ మహారాజా రవితేజ( Raviteja ) కు క్రాక్, ధమాకా వంటి హిట్స్ పడడంతో మళ్ళీ జోష్ పెరిగింది.ఇటీవలే రవితేజ వంశీ దర్శకత్వంలో చేసిన టైగర్ నాగేశ్వరరావు ( Tiger Nageswar Rao ) దసరా కానుకగా రిలీజ్ అయ్యింది.

 Intriguing Teaser Of Ravi Teja’s Eagle Released, Eagle Teaser , Tiger Nages-TeluguStop.com

కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే అవ్వలేదు కానీ పర్వాలేదు అనిపించుకుంది.

ఇక ఈ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా రవితేజ తన నెక్స్ట్ సినిమాలను పూర్తి చేస్తున్నారు.ప్రస్తుతం రవితేజ చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి.అందులో ”ఈగల్” ( Eagle Movie ) ఒకటి.

యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి.

భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తుండగా కొద్దిసేపటి క్రితం టీజర్ (Eagle Teaser) రిలీజ్ అయ్యింది.

ఈ టీజర్ అందరిని ఆకట్టు కుంటుంది.రవితేజ గురించి కథ గురించి ఈ టీజర్ లో చాలా గొప్పగా చెప్పుకొచ్చారు.

అలాగే రవితేజ లుంగీ కట్టి, తుపాకీ పట్టి ఫుల్ మాస్ గా కనిపించాడు.మొత్తానికి టీజర్ తో థ్రిల్లింగ్ యాక్షన్ ఎలిమెంట్స్ చూపించి సినిమాపై మరిన్ని హోప్స్ పెంచేశారు.

ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ( Anupama Parameswaran ), కావ్య థాపర్( Kavya Thapar ) హీరోయిన్ లుగా నటిస్తున్నారు.అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది 2024 సంక్రాంతి టార్గెట్ గా రిలీజ్ కాబోతుంది.మరి ఈ సినిమాతో సంక్రాంతి పోటీలో రవితేజ ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube