సైబర్ నేరాల, సైబర్ భద్రత పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి.

రాజన్న సిరిసిల్ల జిల్లా: సైబర్ నేరాలు, సైబర్ భద్రత పై అవగాహన గురించి ప్రతి నెల మొదటి బుధవారం రోజున సైబర్ జాగౄక్త దివాస్ అనే ప్రత్యేక కార్యక్రమం.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) ఆదేశాల మేరకు సైబర్ నేరాలు పై అవగాహన గురించి ప్రతి నెల మొదటి బుధవారం రోజున సైబర్ జాగౄక్త దివాస్ అనే ప్రత్యేక కార్యక్రమం జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో వివిధ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు, యువతకు, ప్రజలకు సైబర్ భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

 Cyber ​​crimes , Sp Akhil Mahajan, Rajanna Sirisilla , Cyber Jagrukta Diw-TeluguStop.com

సైబర్ జాగౄక్త దివాస్( Cyber Jagrukta Diwas ) కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా సైబర్ సెల్ డిఎస్పీ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో, అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో సైబర్ క్రైమ్ మీద విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.సైబర్ నేరాలపై అవగాహన కల్పించి , సైబర్ నేరాలను నివారించడమే జిల్లా పోలీసుల లక్ష్యంగా విద్యార్థులకు, యువతకు, ప్రజలకు సైబర్ క్రైంపై అవగాహన కల్పించడంలో భాగంగా రాష్ట్ర పోలీస్ ఆద్వర్యంలో సైబర్ జాగౄక్త దివస్ అనే కార్యక్రమం ద్వారా సైబర్ భద్రత తో పాటు సైబర్ నేరాలపై అవగాహన , నివారణకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.

ప్రస్తుత కాలంలో వాట్స్అప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ను పిల్లలు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి వాటిని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లిదండ్రులు పిల్లలకు సూచించాలి.ఈ యెక్క కార్యక్రమ0 లో నేర్చుకున్న విషయాల్ని ప్రతి ఒక్కరు మిగతా వారికి అవగాహన కల్పించాల్సి ఉంటుందని అన్నారు .ఉపాధ్యాయులు సైతం సైబర్ నేరాల నియంత్రణలో తమవంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది.ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ అవగాహన తప్పనిసరి అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube