ఢిల్లీ మెట్రో( Delhi Metro ) ప్రయాణికుల కారణంగా మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.మెట్రోలో ప్రయాణికుల మధ్య అప్పుడప్పుడు చిన్న గొడవలు చోటుచేసుకోవడం సహజమే.
కానీ ఈసారి పెద్ద గొడవే చోటుచేసుకుంది.ఏకంగా ఒక యువకుడిపై యువతి చేయి చేసుకుంది.
ప్రయాణికుల మధ్య జరిగిన వార్ అంతా మెట్రోలోని ప్రయాణిస్తున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఇది వైరల్ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ మెట్రోలో ఓ అమ్మాయి ఎదురుగా సీటుపై కూర్చుని ఉన్న యువకుడికి మధ్య గొడవ జరిగింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో తెగ వైరల్ అవుతోంది.ఇద్దరూ మెట్రోలో తీవ్రంగా వాగ్వాదానికి దిగారు.అమ్మాయి నిలుచుని ఉండగా ఎదురుగా సీటుపై అబ్బాయి కూర్చున్నాడు. ఇద్దరి మధ్య ఏదో గొడవ జరగడంతో అది చిలికి చిలికి గాలివానలా మారింది.దీంతో ఆ అమ్మాయి మరింత ఆవేశానికి గురై ఆ కుర్రాడిపై అందరూ చూస్తుండగానే చేయి చేసుకుంది.

అమ్మాయి కొట్టడంతో ఇద్దరి మధ్య గొడవ మరింత పెరిగింది.దీంతో చుట్టూ ఉన్న తోటి ప్రయాణికులు జోక్యం చేసుకున్నారు.గొడవ పడుతుండగా ఇద్దరూ అడ్డుపడ్డారు.అయినప్పటికీ వాళ్ల వార్ ముగియలేదు.ఆ అమ్మాయి మెట్రో కోచ్ నుంచి కిందకు దిగేంత వరకు ఇద్దరి మధ్య వాగ్వాదం కొనసాగింది.ఇప్పుడు ఈ ఫైట్‌కి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
వీటిని చూసి కొందరు యూజర్లు నవ్వుకుంటుండగా.మరికొంతమంది సీరియ్ అవుతుననారు.
మరి కొందరు మాత్రం ఇప్పుడు మెట్రోలో ఇదే దినచర్యగా మారిపోయిందని విమర్శించారు.రౌడీల్లా ప్రవర్తించి మెట్రోలో కొట్టుకోవడం ఏంటని మరికొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీరి పట్ల తోటి ప్రయాణికులు కూడా అసౌకర్యానికి గురి అువుతన్నారని మండిపడుతున్నారు.







