జబర్దస్త్ షో( Jabardasth Show ) ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో రాకేశ్ ఒకరు కాగా ప్రస్తుతం రాకేశ్ హీరోగా కేసీఆర్ అనే సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమా గురించి, తనకు జరిగిన మోసాల గురించి రాకేశ్ ( Rakesh )షాకింగ్ విషయాలను వెల్లడించారు.
కెరీర్ తొలినాళ్లలో సినిమాలలో చిన్నచిన్న పాత్రలు చేసిన రాకేశ్ సినిమా కోసం ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంటిని తాకట్టు పెట్టానని వెల్లడించడం గమనార్హం.
బినామీ డబ్బులతో కేసీఆర్( KCR ) సినిమాను నిర్మిస్తున్నానని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని రాకేశ్ చెప్పుకొచ్చారు.
ఈ సినిమా చేస్తామని కొంతమంది వ్యక్తులు నాకు మాటిచ్చారని ఆయన అన్నారు.వాళ్లు వెనక్కు తగ్గడం వల్లే నేను ఎంట్రీ ఇచ్చానని రాకేశ్ పేర్కొన్నారు.
ఒక రైటర్ మోసం చేయడం వల్ల సినిమా మొదలుకాకముందే కారు కూడా అమ్ముకున్నానని రాకేశ్ వెల్లడించడం గమనార్హం.

అమ్మతో పాటు భార్య సహకారం వల్లే నేను కెరీర్ పరంగా సక్సెస్ సాధించానని రాకేశ్ చెప్పుకొచ్చారు.నా భార్య సుజాత( Sujata ) బ్యాంకులో దాచుకున్న డబ్బులు ఇస్తానని చెప్పి ప్రోత్సహించిందని రాకేశ్ పేర్కొన్నారు.ఈ సినిమాకు రైటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా, క్యాస్టూమ్ డిజైనర్ గా సుజాత పని చేస్తోందని రాకేశ్ చెప్పుకొచ్చారు.
టాలీవుడ్ నటి సత్యకృష్ణ కూతురు అనన్య మేనన్( Ananya Menon ) ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు.

గరుడవేగ అంజి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.రాకేశ్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.రాకింగ్ రాకేశ్ కష్టానికి తగిన గుర్తింపు దక్కాలని నెటిజన్లు ఫీలవుతున్నారు.
రాకింగ్ రాకేశ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉందని నెటిజన్లు ఫీలవుతున్నారు.రాకింగ్ రాకేశ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.







