సభలు కాదు రోడ్ షోలు ! వ్యూహం మార్చిన కాంగ్రెస్

మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణలో కాంగ్రెస్( Congress ) ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటోంది.వీఆర్ఎస్ , బిజెపిలపై పై చేయి సాధించేందుకు రకరకాల ఎత్తుగడలను వేస్తోంది.

 Meetings Are Not Road Shows! Congress Changed Strategy, Telangana Congress, Brs-TeluguStop.com

ఇప్పటి వరకు భారీ బహిరంగ సభలో నిర్వహణపై దష్టి సారించిన కాంగ్రెస్ ఇకపై వాటికి తాత్కాలికంగా స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. కార్నర్ మీటింగులు,  రోడ్డు షోలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది .కొత్తగా ఏర్పాటు అయిన జిల్లా కేంద్రాలన్నిటిలోనూ ఇతర రాష్ట్రాలకు చెందిన జాతీయ స్థాయి నాయకులతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించే విధంగా నిర్ణయించింది.భారీగా బహిరంగ సభలను నిర్వహించి జనాలను ఆ సభలకు తరలించడం వ్యయ ప్రయాసలతో కూడినది కావడం , ఆర్థికంగానూ భారంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో,  రోడ్ షోలకే ఎక్కువ పరిమితం కావాలని నిర్ణయించుకుంది.

Telugu Brs, Congress, Congressroad, Revanth Reddy, Telangana-Politics

ప్రస్తుతం ఎన్నికలు జరగబోతున్న ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్,  మధ్యప్రదేశ్,  మిజోరం,( Chhattisgarh, Rajasthan, Madhya Pradesh, Mizoram ) మినహా ఇతర రాష్ట్రాల నేతలతో రోడ్డు షోలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.రోడ్ షోలో భాగంగా ఉదయం పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని, సాయంత్రం రోడ్డు షో లు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు .దీని ద్వారా పార్టీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం వస్తుందని,  ప్రజల్లోకి నేరుగా వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు .ఈరోజు భువనగిరి పార్లమెంట్( Bhuvanagiri Parliament ) పరిధిలోని జనగామ, ఆలేరు, భువనగిరి, నియోజకవర్గాల్లో నిర్వహించ తలపెట్టిన రెండో విడత బస్సు యాత్రను కొన్ని కారణాలవల్ల వాయిదా వేసినట్లు కాంగ్రెస్ ప్రకటించింది.ఇక ఈనెల 31న కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ బహిరంగ సభ జరగనుంది.దీంతో పాటు అగ్రనేతలతో మరో రెండు మూడు పెద్ద సభలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారు.

ఆ సభలు తర్వాత బహిరంగ సభలకు స్వస్తి పలికి రోడ్డు షోలు,  కార్నర్ మీటింగ్ లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube