ఎన్నికల నేపథ్యంలో బిజెపికి( BJP ) షాక్ ల మీద షాక్ లు తగ్గుతున్నాయి.మొన్నటి వరకు బీఆర్ఎస్ (BRS) కి గట్టి పోటీ మేమే అంటూ కాలర్ లు ఎదురేసుకొని తిరిగిన బీజేపీ పార్టీ నేతల్లో ప్రస్తుతం జోష్ తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం బీఆర్ఎస్ కు దీటుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. అయితే చాలా రోజుల నుండి బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుండి కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నాయి.
ఈ మధ్యనే కాంగ్రెస్ ని వీడి బిజెపిలోకి వెళ్లిన చాలామంది నేతలు మళ్లీ సొంతగూటికి ప్రయాణం అవుతున్నారు.అలాంటి వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) కూడా ఒకరు.
అయితే ఈయనతో పాటు వివేక్ వెంకటస్వామి కూడా కాంగ్రెస్ లోకి వస్తారు అని ప్రచారం జరిగినప్పటికీ అందులో నిజం లేదు.
అయితే తాజాగా రేవంత్ వివేక్ ల రహస్య భేటీ బయటపడడంతో బిజెపికి గట్టి షాక్ తగలబోతున్నట్టు తెలుస్తోంది.
ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) తాజాగా వివేక్ వెంకటస్వామి తో దాదాపు గంటన్నర పాటు రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తోంది.వివేక్ వ్యవసాయ క్షేత్రంలో రేవంత్ రెడ్డి ఆయనతో మాట్లాడారట.
అయితే ఈ సమయంలో రేవంత్ రెడ్డి తనతో పాటు గన్ మెన్ లను కూడా తీసుకురాలేదట.
కేవలం ఒంటరిగానే రేవంత్ రెడ్డి వివేక్ వెంకట స్వామి (Vivek Venkata swamy) తో భేటీ అవ్వడం ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.దాదాపు గంటన్నర పాటు తన ఎన్నికల ప్రచారాన్ని వదులుకొని వివేక్ వెంకటస్వామితో పార్టీలోకి రావాలి అని ఎన్నో మంతనాలు జరిపినట్టు సమాచారం.ఇక తమ పార్టీలోకి వివేక్ వెంకటస్వామిని ఆహ్వానించగా ఆయన కూడా రేవంత్ రెడ్డి మాటలపై సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది.
ఇంకో రెండు మూడు రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇస్తానని వివేక్ వెంకటస్వామి తెలిపినట్టు సమాచారం.అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, విజయశాంతి లాంటి చాలామంది బీజేపీ లో కొనసాగిన వాళ్ళు కేసీఆర్ (KCR) ని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ లో చేరారు.కానీ బీజేపీ అధిష్టానం కేసీఆర్ కి సానుకూలంగా ఉన్నట్లు ప్రవర్తించడంతో అసంతృప్తితో ఉన్న ఈ నేతలందరూ కాంగ్రెస్ లోకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి వచ్చినప్పటికీ వివేక్ వెంకటస్వామి కూడా రాబోతున్నట్టు సమాచారం.
అలాగే విజయశాంతి కూడా ఈ మధ్యకాలంలో పార్టీ ప్రచారానికి కాస్త దూరంగా ఉంటుంది.ఇక త్వరలోనే విజయశాంతి (Vijayashanti) కూడా బీజేపీ పార్టీ ని వీడి కాంగ్రెస్ లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది.
ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి వివేక్ వెంకటస్వామి తో రహస్యంగా భేటీ అవ్వడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది.