ఈ మధ్య కాలంలో ఏ సినిమా కూడా థియేటర్స్ లో రెండు వారాలు పూర్తి చేసుకోవడమే గగనం.ఎంత హిట్ టాక్ తెచ్చుకున్న లేదంటే ఏ స్టార్ హీరో సినిమా అయినప్పటికీ ఇప్పుడు థియేటర్స్ లో 2 వారాలకే క్లోజ్ కావాల్సిందే.
ఇది వరకు థియేటర్స్ లో 50, 100, 200 రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి.ఇప్పుడు వారానికే సక్సెస్ మీట్ పెట్టి మేకర్స్ మమ అనిపిస్తున్నారు.
అయితే ఇప్పుడు కూడా ఒక సినిమా థియేటర్ లో 50 రోజులు పూర్తి చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది.ఆ సినిమా ఏది అంటే జవాన్( .( Jawan ).బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ( Shah Rukh Khan ) సౌత్ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ”జవాన్”…

ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 7న రిలీజ్ అయ్యింది.రిలీజ్ రోజు నుండి కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ఏకంగా 1000 కోట్లను సైతం దాటేసింది.మొత్తంగా ఇప్పుడు 50 రోజుల థియేటర్ రన్ ముగించుకుంది.50వ రోజు కూడా ఈ సినిమా 11 లక్షలు రాబట్టడం విశేషం.మొత్తంగా 50 రోజుల్లో ఈ సినిమా 1145 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార ( Nayanthara ) హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో దీపికా పదుకొనె కూడా కీలక రోల్ లో నటించింది.విజయ్ సేతుపతి విలన్ రోల్ తో మెప్పించగా ప్రియమణి పలువురు కీలక పాత్రల్లో నటించారు.మొత్తం మీద కింగ్ ఖాన్ క్రేజ్ చూసి అంత గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు.ఇక ఈ ఏడాది డంకీ సినిమాతో డిసెంబర్ 21న మరోసారి ఆడియెన్స్ ను పలకరించ బోతున్నాడు.







