తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో గులాబీ దళం ప్రచార వేగాన్ని పెంచింది.ఈ క్రమంలోనే గులాబీ బాస్ కేసీఆర్ రెండో విడత ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ఇందులో భాగంగా ఇవాళ మూడు బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు.అచ్చంపేట, వనపర్తితో పాటు మునుగోడులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు జరగనున్నాయి.
సీఎం కేసీఆర్ అచ్చంపేటలో ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు.అయితే ప్రచారంలో భాగంగా పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్ కొత్త హామీలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.







