స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో రియల్‌మీ జీటీ 5 ప్రో... ధర ఎంతంటే...?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మీ ఇండియన్‌ మార్కెట్‌కు అదిరిపోయే ఫోన్స్ తీసుకొస్తూ బాగా పాపులర్ అయింది.ప్రస్తుతం రియల్‌మీ GT 5 ప్రో( Realme GT 5 pro ) పేరిట ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది, ఇది 2023, ఆగస్టులో చైనాలో విడుదలైన రియల్‌మీ GT 5 అప్‌గ్రేడెడ్ వెర్షన్.

 Realme Gt5 Pro Set To Launch In India Check Features And Price Details, Realme,-TeluguStop.com

రియల్‌మీ జీటీ 5 ప్రో అనేక లీక్స్‌, పుకార్లతో ఇప్పటికే హైప్ పెంచేసింది.కొన్ని వారాలుగా దాని ఫీచర్లు, స్పెసిఫికేషన్లను టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఫోన్‌లో పెరిస్కోప్ కెమెరా, క్వాల్‌కామ్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్( Snapdragon 8 Gen 3 ) ఉంటుందని అంటున్నారు.రియల్‌మీ ఇంకా లాంచ్ తేదీని ప్రకటించలేదు, కానీ అది ‘ప్రో’ అనే పదంతో చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన వీబోలో టీజర్ చిత్రాన్ని పోస్ట్ చేసింది.

పోస్ట్ టైటిల్ ప్రకారం, “మేం రెండు సంవత్సరాలుగా కష్టపడుతున్నాం, మేం సిద్ధంగా ఉన్నాము! మీరు దాని పేరును ఊహించగలరా?” అని రియల్‌మీ ఒక క్వశ్చన్ అడిగింది.

Telugu Latest, Realme, Realme Gt Pro, Realmegt, Snapdragon Gen, Snapdragon-Techn

వీబోలో రియల్‌మీ చేసిన మరొక పోస్ట్ ప్రకారం, రియల్‌మీ జీటీ 5 ప్రో స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది, ఇది క్వాల్‌కమ్( Qualcomm ) సరికొత్త, అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్.ఫోన్ 24GB వరకు LPDDR5X ర్యామ్ మరియు 1TB వరకు UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుందని కూడా భావిస్తున్నారు.రియల్‌మీ కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్ అయిన రియల్‌మీ UI 5.0తో ఫోన్ ఆండ్రాయిడ్ 14పై( Android 14 ) రన్ అవుతుంది.దీని ధర రూ.59,990 ఉంటుందని అంచనా.

Telugu Latest, Realme, Realme Gt Pro, Realmegt, Snapdragon Gen, Snapdragon-Techn

లీక్ అయిన రియల్‌మీ GT 5 ప్రో కొన్ని ఇతర ఫీచర్లు తెలుసుకుంటే ఇందులో 2K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల BOE AMOLED కర్వ్డ్ స్క్రీన్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్(OIS)తో కూడిన సోనీ IMX9 1/1.4x మెయిన్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 64-మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ OV64B పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటాయి.అలానే 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,400mAh బ్యాటరీ, సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందిస్తారు.

విభిన్న బ్యాటరీ, ఛార్జింగ్ సామర్థ్యాలతో రియల్‌మీ GT 5 యొక్క రెండు వేరియంట్లు.ఒకటి 5,240mAh బ్యాటరీ, 150W ఫాస్ట్ ఛార్జింగ్, మరొకటి 4,600mAh బ్యాటరీ & 240W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube